కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ తెలంగాణలో కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని గౌరవించి అన్ని మతాలు, కులాల వారు సహకరించాలని... లాక్ డౌన్ నిబంధనలను ఉళ్లంఘించి తమ ఆరోగ్యాలనే కాదు సంఘాన్ని నష్టపర్చకూడదని సూచించారు. ఏప్రిల్ 30 తర్వాత కేసులు తగ్గితే లాక్ డౌన్ దశలవారిగా ఎత్తివేయడానికి ఆలోచిద్దామన్నారు.
మర్కజ్ నుండి వచ్చినవారు 1200 మంది వున్నారని తెలిపారు. మొదటిదశలో విదేశాల నుండి వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. జీహెచ్ఎంసీ123, జీహెచ్ఎంసీ బయట 120 మొత్తం 243 కటైన్ మెంట్ ఏరియాలు ఏర్పాటు చేశామని... వీటి వల్ మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నామన్నారు.
లాక్ డౌన్ వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తిచేసుకున్నామని... పదో తరగతి పరీక్షల గురించి త్వరలోనే ఆలోచిద్దామన్నారు. అలాగే 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. అందువల్ల విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్.
రైతుల పండించిన పంటకు చివరి నిమిషంలో నాశనం కావద్దని భావించి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల సమావేశం 3 గంటలు సాగిందన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు తమ తమ అభిప్రాయాలు తెలిపారన్నారు. అందరూ లాక్ డౌన్ కొనసాగించాలని కోరారని... కేవలం ఒకరిద్దరు మాత్రమే రెడ్ జోన్ లోనే అమలు చేయాలని కోరినట్లు కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను ప్రధానికి తెలియజేయనున్నట్లు... ఇందుకోసం కేంద్రానికి రెండు లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు. ఒకటి లాక్ డౌన్ గురించి.. మరొకటి కేబినెట్ డిమాండ్ల గురించి అని వెల్లడించారు.
నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ముందుకు వచ్చి హెలికాప్టర్ మనీ ప్రొవైడ్ చేయాలని అందరు సీఎంలు కోరినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే సీఎం రిలీఫ్ పండ్ నిబంధనలు సులభతరం చేయాలని... అయితేనే మరింత ఎక్కువ మంది విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశం వుందని తెలియజేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం చేతికి వచ్చిన పంటలను మద్దతు ధర చెల్లించి ప్రభుతవమే కొనుగోలు చేయాలని కేబినెట్ తో వాదించి మరీ వ్యవసాయ మంత్రి సాధించారని అన్నారు. ఆయన డిమాండ్ మేరకు పంటల కొనుగోలుపై నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ప్రస్తుతం పంటలు బాగా పండాయని... ఈ సమయంలో రైతుల మధ్య పండగ జరునుకోవాలని వుండిందన్నారు. కానీ కరోనా మూలంగా అలా చేయలేకపోతున్నానని తెలిపారు. వ్యవసాయం విషయంలో తెలంగాణ ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు సాధించిందని....కొత్త రాష్ట్రంలో అద్భుత పలితాలు వచ్చాయన్నారు. కరోనా వల్ల రైతుల వద్దకు వెల్లలేక పోతున్నాని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అందరం కలిసి దేశాన్ని కాపాడుకుందామని ప్రజలకు సూచించారు. ప్రధాని కూడా లాక్ డౌన్ కు సమ్మతించారని... దీనిపై నిర్ణయాన్ని జాతినుద్దేశించి ప్రసంగించే సమయంలో ప్రధాని స్వయంగా వెల్లడించే అవకాశం వుందన్నారు.
హెలికాప్టర్ అంబులెన్స్ లు వుండే అధునాతన వైద్య సదుపాయాలున్న అమెరికా కూడా కరోనాతో అల్లాడుతోందని అన్నారు. ప్రస్తుతం 10 వేల మంది అక్కడ క్రిటికల్ స్టేజ్ లో వున్నట్లు అధికారికంగా వెల్లడించారని అన్నారు. కానీ భారతదేశంలో కేవలం 300లోపే చావులు వున్నాయని... 7వేలకు పైగా పాజిటివ్ కేసులు మాత్రమే వున్నాయన్నారు.
ప్రజల సహకారమే కరోనా నియంత్రకు కారణమన్నారు. వారు మరింత ఓపికపట్టాలని సూచించారు. ఏప్రిల్ 30వరకు కరోనాను దేశంనుండి తరలించాలని దేవున్ని కోరతున్నానని అన్నారు. ఏప్రిల్ 30 వరకు దేన్ని అనుమతించంబోమని... కేవలం వ్యవసాయ రంగానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే పరిశ్రమలు రైస్ మిల్స్, పిండి మరలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. నిత్యావసరాలు అందించే పరిశ్రమలకు అనుమతిచ్చారు.
రాష్ట్రాలకు వుండే అప్పులను 6 నెలలు వాయిదా వేయించాలని ప్రధానిని కోరామన్నారు. తినుబండారాలు, వంటనూనెలు కల్తీ చేస్తే పిడి యాక్ట్ పెడతామని హెచ్చరించారు. కరోనా సోకినవారిని డిశ్చార్జ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని... జబ్బున్నవారిని సమాజంలోకి పంపితే ఆటంబాంబు పంపినట్లేనని కేసీఆర్ పేర్కొన్నారు.