కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పూజలు.. జాతీయ పార్టీలకు స్థానిక సంస్థల్లో బలంలేదని కామెంట్స్... (వీడియో)

Published : Nov 27, 2021, 02:54 PM IST
కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత పూజలు.. జాతీయ పార్టీలకు స్థానిక సంస్థల్లో బలంలేదని కామెంట్స్... (వీడియో)

సారాంశం

ఎమ్మెల్సీలుగా అవకాశంరాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని కవిత తెలిపారు. పార్టీలో అందరికీ అవకాశం లభిస్తుందని తెలిపారు. అంతకుముందు నిజామాబాద్ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తున్న కవిత... మార్గమధ్యలో మోర్తాడ్ వద్ద కాసేపు ఆగారు. 

కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపు లాంఛనమేనని ఎమ్మెల్సీ Kalvakuntla Kavitha తెలిపారు. Jagityal జిల్లా మెట్‌పల్లిలో పర్యటించిన ఆమెకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకు బలం లేనందున.... ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం తెరాసకు మద్దతునివ్వాలని ఆమె కోరారు. 

"

ఎమ్మెల్సీలుగా అవకాశంరాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని కవిత తెలిపారు. పార్టీలో అందరికీ అవకాశం లభిస్తుందని తెలిపారు. అంతకుముందు నిజామాబాద్ నుంచి కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తున్న కవిత... మార్గమధ్యలో మోర్తాడ్ వద్ద కాసేపు ఆగారు. మోర్తాడ్ వద్ద కవితకు తెరాస కార్యకర్తలు స్వాగతం పలికారు. నిజామాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కవిత ఈ సందర్భంగా తెలిపారు.

రెండవసారి ఎమ్మెల్సీ గా ఎన్నికైన తరువాత మొదటిసారిగా కవిత kondagattu anjanna temple ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ...కొండగట్టు అంజన్న ను దర్శించుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నానన్నారు. కొండగట్టు ను అభివృద్ధి చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. దేవాలయల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు.

ఇదిలా ఉండగా, నిజామాబాద్  జిల్లా local body quota ఎమ్మెల్సీ ఎన్నికల్లో trs అభ్యర్ధి kalvakuntla kavitha  నవంబర్ 24 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్ధిగా శ్రీనివాస్ వేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ స్థానానికి రెండే నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనిపై అధికారులు ప్రకటించానున్నారు. 

తిరిగి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం... తల్లితో కలిసి అష్టలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు

అంతకుముందు నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. srinivasను బలపరుస్తూ తాము సంతకాలు చేయలేదంటున్నారు ఎంపీటీసీ, కార్పొరేటర్‌. అంతేకాదు తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి వీరు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఇటీవల రాజ్యసభ సభ్యుడు Banda Prakash ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో... ఆయన స్థానంలో కవితను పంపిస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టిఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు తెరదించుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరునే ఖరారు చేసింది. 

కాగా,  సోమవారం వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి,  ఖమ్మం నుంచి తాత మధుసూదన్ నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలినవాళ్ళు చివరి రోజైన మంగళవారం  నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన జరిగింది. 26నాడు నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. డిసెంబర్ 10న  పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 

ఎమ్మెల్యే కోటా లో ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవం అయిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సభ్యులకు సర్టిఫికెట్లు కూడా జారీ చేసింది.  మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, రవీందర్, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి లు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?