పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహితతో సహజీవనం.. కోరిక తీరాక, ఫోటోలతో బ్లాక్ మెయిల్...

By Bukka Sumabala  |  First Published Jul 30, 2022, 9:53 AM IST

ఓ వ్యక్తి భర్తతో దూరంగా ఉంటున్న మహిళను పెళ్లైన విషయం దాచిపెట్టి, నమ్మించి సహజీవనం చేశాడు. ఆ తరువాత విషయం తెలియడంతో బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు.  


హైదరాబాద్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోర్కెలు తీర్చుకుని బ్లాక్మెయిల్కు పాల్పడిన వ్యక్తిపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు సమాచారం మేరకు ఏపీలోని మచిలీపట్నంకు చెందిన పార్వతి టైలరింగ్ చేస్తూ బీకేగూడ ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది. భర్త తో విడిపోయిన ఆమె.. కూతురుతో కలిసి రెండు సంవత్సరాల క్రితం చందానగర్ లో ఉన్న సమయంలో అమర్ తేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుని నీ కూతురును కూడా బాగా చూసుకుంటాను.. అని నమ్మించి ఆరు నెలలపాటు ఆమెతో సహజీవనం చేశాడు. 

అయితే, ఆ తరువాత అమర్ తేజకు వివాహం జరిగినట్లు తెలియడంతో పార్వతి అతడిని నిలదీసింది. ఇధి మనసులో పెట్టుకుని ఆమెను వేధిస్తుండడంతో.. బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో పోలీసులు వారిద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో  అక్కడి నుంచి ఆమె బి.కె గూడాకు వచ్చి ఉంటుంది. గతంలో ఆమెతో ఉన్న సమయంలో దిగిన ఫోటోలను చూపించి.. తన వద్దకు రావాలని.. లేదంటే ఫోటోలను మీ బంధువులకు పంపుతానని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.

Latest Videos

undefined

తోటి విద్యార్థినికి ‘ఐలవ్యూ’ చెప్పి.. న్యూడ్ వీడియో కాల్స్ చేయమని.. బ్లాక్ మెయిల్..

ఇదిలా ఉండగా, పెళ్లిరోజునాడు అత్యంత నాటకీయంగా ఆర్కే బీచ్ లో అదృశ్యమైన సాయి ప్రియను పోలీసులు ఎట్టకేలకూ విశాఖకు తీసుకు వచ్చారు.  సాయి ప్రియ తో పాటు ప్రియుడు రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వీరిద్దరూ మొదట ఎయిర్ పోర్ట్ లో పీఎస్ లో లొంగిపోయారు. అక్కడినుంచి వారిని 3 టౌన్ కు తరలించారు. తమ వల్ల ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపోయినందుకు ఇద్దరు తరఫున క్షమాపణలు కోరుకుంటున్నానని సాయిప్రియ తాజా భర్త చెప్పుకొచ్చాడు. 

పెళ్లిరోజునాడు భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్ కు వచ్చిన సాయిప్రియ.. సాయంత్రం ఏడు గంటల సమయంలో కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సముద్రంలో గల్లంతయ్యిందనుకుని.. రెండు రోజుల పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది విమానాల్లో గాలించారు. అయితే చివరికి సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్టు తెలియడంతో ఖంగు తిన్నారు. ఆమె తను తన ప్రియుడితో వెళ్లిపోయానని, అతడిని పెళ్లి చేసుకున్నానని తాళితో ఉన్న ఫొటోలను తల్లిదండ్రులకు పంపించింది. దీంతో గల్లంతు కాస్త కావాలనే వెళ్లిపోయినట్టుగా తేలింది. ఆ తరువాత నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్లిన సాయిప్రియ, ఆమె ప్రియుడు రవిని పోలీసులు ఎట్టకేలకు విశాఖపట్నం తీసుకువచ్చారు. 

click me!