రాష్ట్ర సాధకుడికి ‘దక్షిణ తెలంగాణ’ ముప్పు

Published : May 14, 2017, 10:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
రాష్ట్ర సాధకుడికి ‘దక్షిణ తెలంగాణ’ ముప్పు

సారాంశం

బంగారు తెలంగాణ దిశగా ముందుకుసాగుతుంటామంటున్న గులాబీ సర్కారు అధికారంలోకి వచ్చాక సిద్దిపేటను తప్పా మరో ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

మూడేళ్ల ముచ్చట తీరకముందే తెలంగాణ రెండు ముక్కలయ్యే పరిస్థితి వచ్చేస్తుందా అంటే అవుననే అనిపిస్తుంది.

 

మొగ్గలా ఉన్న ఓ ఆలోచన ఇప్పుడిప్పుడే పురివిప్పుతోంది. దీనికి కారణం నాడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన పార్టీయే...

 

పాలమూరు గోస పోవాలంటే ప్రత్యేక తెలంగాణ రావాలని కోట్లాడిన పార్టీయే...

 

నల్లగొండ ఫ్లోరైడ్ ను తరమికొట్టాలంటే తెలంగాణ సాధించాలని డిమాండ్ చేసిన పార్టీయే...

 

బంగారు తెలంగాణ దిశగా ముందుకుసాగుతుంటామంటున్న గులాబీ సర్కారు అధికారంలోకి వచ్చాక సిద్దిపేటను తప్పా మరో ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

 

సిద్దిపేటకు పక్కనే ఉన్న జనగామ ప్రాంతానికి రావాల్సిన నీటిని ఇప్పటికే సీఎం నియోజకవర్గానికి తరలించకపోతున్నారు. దీంతో ఆ ప్రాంత రైతులు కన్నెర్రజేస్తున్నారు.

 

ఇక దక్షిణ తెలంగాణపై కేసీఆర్ సర్కారుది సవతితల్లి ప్రేమే అని విపక్షాలు ఇప్పటికే విమర్శలుగుప్పిస్తున్నాయి. వాటిని ధీటుగా తిప్పికొట్టాల్సిన సర్కారు మాత్రం తమ రూటు సిద్ధిపేటే అనేలా ప్రవర్తిస్తున్నాయి.

 

అందుకే ఇటీవల దక్షిణ తెలంగాణ రాష్ట్రం కోసం నేతలు స్వరం పెంచుతున్నారు.

 

దక్షిణ తెలంగాణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివక్షను ప్రదర్శిస్తున్నారని, ఇలానే కొనసాగితే ప్రత్యేక రాష్ట్రం కోసం మరో ఉద్యమం తప్పదని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు.

 

డిండి, పాలమూరు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే రైతులకు నష్టం జరుగుతుందని, మహబూబ్‌నగర్, నల్లగొండ ,రంగారెడ్డి పాతజిల్లాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ కూడా ఇదే అంశాలపై ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.

 

ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ ఆమె ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను మరోసారి బయటకు తీశారు.

 

ఇక టీడీపీ నేత రేవంత్ రెడ్డి కూడా గులాబీ సర్కారు దక్షిణ తెలంగాణపై వివక్ష చూపుతోందని చాలా సార్లు విమర్శించారు.

 

ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఉత్తర తెలంగాణ తో పోల్చితే దక్షిణ తెలంగాణకు, మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారి ఆవేదన.

ఆ వేదన నుంచే ఇలా నేతలు కాస్త సీరియస్ గానే దక్షిణ తెలంగాణ జపం చేస్తున్నారు.

 

ఇప్పట్లో ఈ విషయం లైట్ గా కనిపించినా భవిష్యత్తులో టీఆర్ఎస్ సర్కారుకూ మాత్రం ఈ నినాదం ప్రబలమైతే ముప్పుతప్పదు.

PREV
click me!

Recommended Stories

Daughter Kills Parents: ప్రేమ పెళ్లి విషాదం.. తల్లిదండ్రులను హతమార్చిన కూతురు | Asianet News Telugu
Medaram Sammakka Saralamma Jatara 2026 Begins | 4000 Special RTC Buses | Asianet News Telugu