
జగన్ కేసులను విచారించిన నాటి సీబీఐ జేడీగా అధికారి లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. ఆయన తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మకను కలవడం రకరకలాకథనాలకు తావిస్తాఉంది. మహారాష్ట్ర ఐపిఎస్ అధికారి అయిన లక్ష్మినారాయణ తెలంగాణాకు డెప్యుటేషన్ రావాలనుకుంటున్నారని, అందుకే కలిశారని చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రలో సిబిఐ జెడి ఉన్న లక్ష్మినారాయణ సిబిఐ డెప్యుటేషన్ అయిపోవడంతో మహారాష్ట్ర వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఆ రోజుల్లో హీరో వర్షిప్ అందుకున్నారు. అయితే, మహారాష్ట్ర వెళ్లాక ఆయనకు ఏ ప్రాముఖ్యం ఇవ్వలేదు. చాలా కాలం పోస్టింగ్ ఇవ్వలేదు. దీనితో ఆయన శెలవు మీద వెళ్లారు. ఒకదశలో రాజీనామా చేసి ఏదో అవినీతి వ్యతిరేక ఉద్యమం కోసం ఒక సంస్థ స్థాపిస్తారని అనుకున్నారు. మరొక శేషన్ అని కూడా కొంతమంది భావించారు. అయితే అలా జరగలేదు.
ఒకే సారి దేశాన్ని కుదిపేసిన కేసులయిన ఓబులాపురం మైనింగ్, ఎమ్మార్ ప్రాపర్టీస్, మైటాస్ వంటి కేసులను ఆయన విచారించారు. బహుశా ఆయన సర్వీస్ లో ఇలాంటి ఘట్టం మరొకటుండదేమో.
ఆయన మొత్తానికి మహారాష్ట్ర విధుల్లోనే చేరిపోయారు. అక్కడ కూడా ఆయన ఒక సన్సేషన్ సృష్టించారు. జాయింట్ కమిషనర్ హోదాలో ధానే ప్రాంతంలో పేరుమోసిన ఉత్సవ్ డ్యాన్స్ బార్ మీద రెయిడ్ చేశారు. అక్కడొక డైరీ పట్టుకున్నారు. ఇది ముంబాయిపోలీసులకు, డ్యాన్స్ బార్లకు ఉన్న అక్రమ సంబంధమెలాంటిదో బయటపెట్టింది. ఈ పోలీసుకు నెలనెలా ముడుపు ఎలా ముడుతున్నదో చెప్పే వివరాలన్నీ ఈ డైరీలో ఉన్నాయి.
1990బ్యాచ్ ఐపిఎస్ బ్యాచ్ చెందిన లక్ష్మినారాయణ ఇపుడు మహారాష్ట్రలో అడిషనల్ డిజిపిగా ఉన్నారు. ఆయన తెలంగాణా వస్తారేమోచూడాలి.