టెక్కీ లావణ్య లహరి ఆత్మహత్య కేసు: అత్తతో సహా నలుగురి అరెస్ట్, మామ పరారీ

By telugu teamFirst Published Jul 7, 2020, 3:22 PM IST
Highlights

మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు లావణ్య లహరి ఆత్మహత్య కేసులో పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. లావణ్య లహరి భర్తను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వారిని తూర్పు గోదావరి జిల్లాలో అరెస్టు చేసి హైదరాబాదుకు తరలిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణలోని శంషాబాద్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య లహరి కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమె భర్త వెంకటేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. లావణ్య లహరి ఆత్మహత్య చేసుకున్న మరుక్షణం నుంచి ఆమె అత్తామామలు రమాదేవి, మల్లాది సుబ్బారావు కనిపించకుండా పోయారు. 

లావణ్య లహరి అత్తను పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా లావణ్య లహరి ఇద్దరు ఆడపడుచులను, మధ్యవరితిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని బంధువుల ఇంట్లో అరెస్టు చేశారు. మామ మాత్రం పోలీసులకు చిక్కలేదు. అతను పరారీలోనే ఉన్నాడు.

Also Read: లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం: అంతా ఆ మహిళ వల్లే..!!!

భర్త వేధింపులతో వారం రోజుల క్రితం లావణ్య లహరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు స్టే,న్ పరిధిలో నివాసం ఉంటున్న లావణ్య లహరి (32) భర్త వెంకటేష్ ప్రవర్తన, అక్రమ సంబంధాలు, వేధింపులతో విసిగిపోయి ఆత్మహత్య  చేసుకుంది. తన ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

లావణ్య, వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందినవారు. వారు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వెంకటేష్ ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పనిచేస్తున్నాడు. 

Video: టెక్కీ లావణ్య లహరి ఆత్మహత్య కేసు: భర్త ఇతనే, అరెస్ట్

click me!