కరోనా దెబ్బకు మెట్రో కుదేలు: రూ. 200 కోట్ల నష్టం, గడువు పెంచాలని లేఖ

By narsimha lodeFirst Published Jul 7, 2020, 1:40 PM IST
Highlights

కరోనా కారణంగా మూడున్నర నెలలుగా మెట్రో రైళ్లు నడవడం లేదు. మెట్రో సర్వీసులు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా స్పష్టత లేదు. దీంతో మెట్రో రైలు సంస్థ తమకు ఇచ్చిన గడువును పెంచాలని కోరింది. 


హైదరాబాద్: కరోనా కారణంగా మూడున్నర నెలలుగా మెట్రో రైళ్లు నడవడం లేదు. మెట్రో సర్వీసులు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా స్పష్టత లేదు. దీంతో మెట్రో రైలు సంస్థ తమకు ఇచ్చిన గడువును పెంచాలని కోరింది. లేదా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా సమాచారం.

కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ  ఏడాది మార్చి 22వ తేదీ నుండి మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. దేశ వ్యాప్తంగా మెట్రో సర్వీసులు నడిపే విషయంలో కేంద్రం నుండి ఎలాంటి స్పష్టత రాలేదు. హైద్రాబాద్ లో సిటీ బస్సులను నడపడం లేదు. సిటీ బస్సులు నడిపితే కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం వీటిని నడపడం లేదు.

హైద్రాబాద్ లో మెట్రో రైల్వే సర్వీసుల ఎప్పుడు ప్రారంభం కానున్నాయో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మెట్రో రైల్వే సంస్థకు రోజు రోజుకు నష్టాలు పెరిగిపోతున్నాయి. ప్రతి నెలా మెట్రో రైలు సంస్థకు రూ. 50 కోట్ల ఆదాయం వచ్చేది. మూడున్నర నెలలుగా రైల్వే సర్వీసులు నిలిచిపోవడంతో రూ. 200 కోట్లు నష్టం వాటిల్లిందని ఆ సంస్థ చెబుతోంది.

ప్రతిరోజూ సగటున ఈ సంస్థకు రూ. 4 లక్షలు, సెలవు రోజుల్లో రూ. 5 లక్షల ఆదాయం వచ్చేది. అయితే కరోనాతో మూడున్నర నెలలుగా  మెట్రో రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. టిక్కెట్ల ఆదాయంతో పాటు ప్రకటనలు, షాపింగ్ కాంప్లెక్స్ ల ద్వారా 35 ఏళ్ల పాటు ఈ సంస్థ పెట్టుబడిని తిరిగి పొందేందుకు వీలుంది.

కరోనా వైరస్ కారణంగా మెట్రో రైలు సేవలు నిలిచిపోవడంతో తమకు పరిహారం ఇవ్వాలని ఆ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాసింది. లేదా తమకు ఇచ్చిన గడువును పొడిగించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని ఆ లేఖలో కోరినట్టుగా తెలుస్తోంది.
 

click me!