
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చందానగర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఉపాధ్యాయురాలు పదో తరగతి విద్యార్థితో పారిపోయింది. ఈ ఘటన చందానగర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్ లోని ఓ మహిళ (26) ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేస్తుంది. గచ్చిబౌలికి చెందిన ఓ విద్యార్థి (15) ఇదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. కాగా ఫిబ్రవరిలో.. సదరు మహిళా టీచర్ తాతయ్య.. తన మనమరాలు కల్పించడం లేదంటూ చందానగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.
ఆ తర్వాత రెండు రోజులకి తన మనవరాలు తిరిగి వచ్చిందని కేసు విత్ డ్రా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే.. సరిగ్గా టీచర్ అదృశ్యమైన రోజుల్లోనే తమ కొడుకు కూడా కనిపించడం లేదంటూ 10వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు అతను కూడా తిరిగి వచ్చాడంటూ వారు కూడా కేసు విత్ డ్రా చేసుకున్నారు. విద్యార్థిని పోలీసులు ఎక్కడికి వెళ్లావు అని కూపీలాగారు. దీంతో ఆ విద్యార్థి చెప్పిన విషయం విని తల్లిదండ్రులు, పోలీసులు షాక్ అయ్యారు.
సీఎస్ శాంతికుమారికి రెరా తాత్కాలిక బాధ్యతలు... శాశ్వత అథారిటీ ఏర్పాటు అయ్యేదాకా ఆమే....
తాను తన స్కూల్లోని మహిళా టీచర్ తో కలిసి ఫిబ్రవరి 16వ తేదీన వెళ్లినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు టీచర్ని పిలిచి విషయం కనుక్కున్నారు. నిజమే అని తేలింది. దీంతో టీచర్ కు, విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమించుకున్నట్లుగా తేలింది. టీచర్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. ఇది నచ్చని టీచర్, స్టూడెంట్ ఈ విధంగా చేసినట్లుగా పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగు చూసింది. విద్యార్థి మృతి కేసులో ఉపాధ్యాయురాలిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై అంబత్తూరుకు చెందిన ప్లస్ టూ ముగించిన విద్యార్థి (17) ఆగస్టు 30వ తేదీన స్నేహితులతో కలిసి చెన్నై రాజధాని కళాశాలలో కౌన్సెలింగ్ కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత గదిలో ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అంబత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
అంబత్తూర్ లోని సర్ రామస్వామి మొదలియార్ హైయర్ సెకండరీ పాఠశాలలో అతను చదువుతున్నప్పుడు టెంపరరీ టీచర్ గా పనిచేస్తున్న మహిళ నడుపుతున్న ట్యూషన్ కు బాలుడు వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో అతడిని ప్రేమించినట్టు ఆమె చెప్పిందని తెలిసింది. ఆ తరువాత ఆమెకు ఇంట్లో వివాహం నిశ్చయించడంతో విద్యార్థితో మాట్లాడటం మానేసింది. తర్వాత తనను పట్టించుకోలేదని మనస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఉపాధ్యాయురాలిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.