టిడిపిలో రేవంత్ టెన్షన్...

Published : Oct 25, 2017, 11:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
టిడిపిలో రేవంత్ టెన్షన్...

సారాంశం

రేవంత్ రెడ్డి మీద వేటుకు రంగం సిద్ధం చేసిన అధిష్టానం వేటు విషయంలో తెలంగాణ నేత ఎల్. రమణను ముందు పెట్టిన పార్టీ చంద్రబాబుకు ఎల్. రమణ లేఖ, రేవంత్ ను పదవుల నుంచి తొలగించాలని వినతి రేపటి టిడిఎల్పీ పై వీడని ఉత్కంఠ.. పార్టీ నేతల్లో టెన్షన్ టెన్షన్

తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి రాజకీయం మరింత రంజుగా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఇటు తెలంగాణ కేడర్ లోనే కాక అటు ఆంధ్రా టిడిపి కేడర్ లోనూ నెలకొంది. అనుక్షణం వేగంగా ఉత్కంఠ పరిణామాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయమంతా వైఫై మాదిరిగా తిరుగుతున్నది.

గత పదిరోజులుగా తెలుగుదేశం పార్టీలో రేవంత్ ఎపిసోడ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆ పార్టీలోనే కాక తెలుగు రాజకీయాలను వేడెక్కేలా చేశారు రేవంత్ రెడ్డి. ఆయన ఎప్పుడైన ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారో ఆనాటి నుంచి మొదలైన రాజకీయ దుమారం ఇంకా ఆగలేదు. పైగా రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఎప్పుడు ఏమైతుందా అన్న ఉత్కంఠ అన్ని పార్టీలలో నెలకొంది.

తాజాగా రేవంత్ రెడ్డి వర్సెస్ ఎల్. రమణ పైట్ గా మారిపోయింది. రేవంత్ మీద వేటు వేసే దిశగా టిడిపి అధిష్టానం పావులు కదుపుతున్నది. రేవంత్ మీద చర్యలు తీసుకునే విషయంలో పార్టీ నాయకత్వం ఎల్. రమణను ముందుకు పెట్టి కథ నడిపించే పనిలో ఉంది పార్టీ నాయకత్వం. ఎందుకంటే చంద్రబాబే స్వయంగా రేవంత్ మీద వేటేస్తే... తెలంగాణలో బలమైన నాయకుడిని వెళ్లగొట్టారన్న అపవాదు వస్తుందన్న ఉద్దేశంతో ఎల్. రమణను ముందు పెట్టింది పార్టీ అధిష్టానం అని ఒక సీనియర్ తెలంగాణ టిడిపి నాయకుడు వ్యాఖ్యానించారు.

ఇక ఎల్. రమణ రంగంలోకి దిగారు. విదేశాల్లో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. తక్షణమే రేవంత్ రెడ్డికి పార్టీ లో అప్పగించిన అన్ని పదవుల నుంచి తొలగించాలని లేఖలో అధినేతను కోరారు. టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్, టిడిఎల్పీ నేత పదవుల నుంచి తొలగించాలని కోరారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన విషయంలో రేవంత్ ఇచ్చిన వివరణ సరిగా లేదని, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణను కలిసిన విషయమై కూడా రేవంత్ క్లారిటీ ఇవ్వలేదని, కాబట్టి పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు రమణ.

తెలంగాణ అధ్యక్షుడు రమణ లేఖ రాయడం చూస్తే రేవంత్ రెడ్డి మీద ఏ క్షణమైన వేటు పడక తప్పదన్న వాతావరణం టిడిపి శ్రేణుల్లో నెలకొంది. రేవంత్ తుపాన్ టిడిపిలో చివరి దశకు చేరుకుందని, ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి మీద వేటు పడడం ఖాయమని టిడిపి సీనియర్లు చర్చించుకుంటున్నారు. అయితే టిడిఎల్పీ నేత హోదాలో రేపు రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని టిడిఎల్పీ ఆఫీసులో టిడిఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలు, మాజీ మంత్రులను ఆహ్వానించారు. మరి ఆ సమావేశంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

రేవంత్ రెడ్డి మాత్రం రేపు టిడిఎల్పీ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. సమావేశానికి వచ్చేవారందరూ రావాలని కోరారు. టిడిఎల్పీ నేతగా సమావేశం పై నిర్ణయాధికారం తనకు ఉంటుంది తప్ప పార్టీ అధ్యక్షుడిగా రమణకు కాదని రేవంత్ అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు మరింత రంజుగా మారింది. ఇదే సమయంలో తమ మిత్రపక్షమైన బిజెపి సభ్యులతో కలిపి ఉమ్మడి సమావేశం జరపున్నట్లు రమణ ప్రకటించారు. .రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హోటల్ గోల్కొండలో టీడీపీ,  బీజేపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల సమావేశం ఏర్పాటు చేసినట్లు రమణ స్పష్టం చేశారు.  మొత్తానికి ఈ పరిణామాలు సరి కొత్త టెన్షన్లను సృష్టిస్తున్నాయని పార్టీ నేతలు అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం