క్లారిటీ ఇవ్వకపోతే రేవంత్ పై వేటు

Published : Oct 24, 2017, 03:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
క్లారిటీ ఇవ్వకపోతే రేవంత్ పై వేటు

సారాంశం

రేవంత్ క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ ఇవ్వకపోతే వేటు తప్పదు క్లారిటీ ఇచ్చే వరకు సమావేశాలకు ఆహ్వానం లేదు మోత్కుపల్లి గవర్నర్ పదవి రాలేదన్న బాధలో ఉన్నారు

టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి అధిష్టానం ఉచ్చు బిగిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర టిడిపి నేతలు రేవంత్ మీద వేటు వేయాల్సిందే అని గట్టిగా కోరుతున్నారు. దీంతో అధిష్టానం రేవంత్ మీద వేటు దిశగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్. రమణ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాకు వెల్లడించారు. రేవంత్ మీద వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇవ్వకపోతే వేటు తప్పదని హెచ్చరించారు. మరిన్ని అంశాలపైనా రమణ మాట్లాడారు. ఆయన ఏమన్నారో చదవండి.

మోత్కుపల్లి కి గవర్నర్ పదవి రానందునే డిప్రెషన్ లో ఉన్నారని అందుకే మోత్కుపల్లి టీఆరెస్ తో పొత్తుపై మాట్లాడారు. 119 అసెంబ్లీ నియోజకవర్గం లో టిటిడిపి ప్రజా సమస్యల పై మీటింగ్స్ ఏర్పాట్లు చెయ్యాలి అని గతంలో నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సొంత పని మీద ఢిల్లీ కి వెళ్తున్నా అని నాతో చెప్పారు...కానీ అక్కడ కాంగ్రెస్ నేతలతో కలిసారని ప్రచారం జరుగుతుంది.

మొన్న జరిగిన మీటింగ్ లో రేవంత్ ని పార్టీ సీనియర్లు రేవంత్ ని అడిగారు..దానికి రేవంత్ ప్రస్తావనను దాటవేశారు. డీకే అరుణను రేవంత్ కలిశారు అని ఆమెనే చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ ఆశయాలకు, చంద్రబాబు ఆదేశాలతో గత 35 సంవత్సరాల నుంచి పార్టీ ని నడుపుతున్నాము. అయితే పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం వల్ల కేడర్ కు వేరే సంకేతాలు వస్తున్నాయి. స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి స్పందించారు కానీ అందులో క్లారిటీ లేదు.

రేవంత్ డీకే అరుణ ను కలిసారా లేదా, కుంతియా తో కలిసారా లేదా అన్నది రేవంత్ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. 1996 నుంచి 2014 వరకు 8సార్లు బి ఫామ్ నాకు టిడిపి అధిష్టానం ఇచ్చింది...96లో గెలిచాను, 2009లో గెలిచాను. తెలంగాణ లో బడుగుబాలహీన వర్గాలకు అన్ని విధాలుగా అవకాశం కల్పించాలనే...టిడిపి నడుస్తుంది. పార్టీలో ఏమి జరిగినా చంద్రబాబు కు సమాచారం ఇస్తున్నాము.

 2015లో రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎవ్వరైనా పార్టీ వల్లన ఎదిగిన వారే కాబట్టి పార్టీని బలోపేతం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి. రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో నుంచి బయటకు పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే...అన్యాయంగా 30మందిని సస్పెండ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. నేను బీజేపీతో మాట్లాడి కాంగ్రెస్, సిపిఐ,సిపిఎం సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొట్ట మొదటి బంద్ కి పిలుపు ఇచ్చాను.

ఇప్పటి వరకు రేవంత్ కి నేను అన్ని రకాలుగా సహకరించాను..కానీ రేవంత్ వ్యక్తిగతంగా వెళ్తున్నారు. టిడిపి నియమనిబంధనల ప్రకారం పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా ఏమి మాట్లాడకూడదు. టీడీఎల్పీ మీటింగ్ కి వెళ్లాలా లేదా అన్నది ఇంకా చర్చలు జరపలేదు. అసెంబ్లీ లో చర్చల పై బీజేపీతో మాట్లాడాలి..వాళ్ళతో చర్చల అనంతరం ప్రణాళికలు సిద్ధం చేస్తాము. సమస్యల పై అన్ని పార్టీలు కలిసే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మోత్కుపల్లి టీఆరెస్ పార్టీతో మాట్లాడారని 8వ తేదీన చంద్రబాబు మీటింగ్ లో చర్చ వచ్చింది..దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇతర పార్టీలతో పొత్తుపై ఇప్పుడే ఇవ్వలేము... పొత్తుల విషయంలో మా పార్టీ బలంతో ముందుకు వెళ్తాము. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా ఏక గ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదు... కాబట్టి మా సపోర్ట్ కావాలి. రేవంత్ తో పాటు ఇతర నేతల పై వస్తున్న ప్రచారం పై చర్యలు తీసుకోవాలా లేదా అన్నది పరిశీలిస్తున్నాము. రేవంత్ రెడ్డిని మా కుటుంబ సభ్యులుగా చూస్తున్నాము..ఆయనే కాదు ఎవ్వరి పై అయినా ఈజీగా చర్యలు తీసుకోలేము. రేవంత్ రెడ్డి తో నేను మాట్లాడిన దానికి నేనే వచ్చి మాట్లాడుతా అన్నారు.

రేవంత్ తో నాతో పాటు పెద్దిరెడ్డి, రేవురి ప్రకాష్ చెప్పారు. పార్టీలో నేతలు ఎవ్వరు కూడా పార్టీ లైన్ దాటకూడదని ఆదేశాలు ఉన్నాయి. ఎర్రబెల్లి ఆయన నాతో కలిసి క్లారిటీ ఇచ్చారు...టిడిపి నేతలు టీఆరెస్ లో కలిసే విషయం పై. టిడిపి ఎప్పుడు కూడా ఇతర పార్టీ లైన్ లోకి వెల్లదు..ఇతర పార్టీ లు మా లైన్ లోకి రావాల్సిందే. పార్టీలో వ్యక్తిగత ఆరోపణల పై నోటీసులు ఇవ్వడం పై అన్ని రకాలుగా చర్చించి ఇస్తాము.

పరిటాల ఇంట్లో జరిగిన విషయం పై రేవంత్ అలా స్పందించాల్సింది కాదు. రేవంతే కాదు..ఎవ్వరైనా పార్టీ లైన్ తప్పితే వాళ్ళను పార్టీ నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. గతంలో ఇతర నేతలు రేవంత్ తహరలో చేసిన వాళ్ళు చంద్రబాబు కి వివరణ ఇచ్చుకున్నారు. ఓటుకు నోటు కేసు కోర్టులో ఉంది...దాని మీద నేను మాట్లాడను. కోర్టు కేసు క్లియర్ అయితుంది, రేవంత్ బయటపడతారు.

టిడిపి నేతలు ప్రభుత్వంతో పనులు చేయించుకుంటే తప్పేంటి. ఇన్ని ఏండ్లలో కేసీఆర్ ఇంటికి ఒకే సారి ఎల్ రమణ వెళ్లారు...రాజకీయంగా నేను ఏ రాజకీయ నేతతో కలువను. క్రమశిక్షణ అంటే రమణ, రమణ అంటే క్రమశిక్షణ.పార్టీ ఎమ్ చెప్తే అది చేసిన. ఖాళీ ఖాళీ అన్న టిటిడిపి పార్టీ ఇప్పుడు మీడియా లో ప్రచారం 20 మంది, 30 మంది నాయకుల పేర్లు వస్తున్నాయి...దీంతో పార్టీ కి చాలా బలం వచ్చిందన్నారు రమణ.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/Xh3cbG

PREV
click me!

Recommended Stories

Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?
తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!