రేవంత్ కు షాక్ ఇచ్చేందుకు రంగంలోకి ఇంకో మంత్రి

Published : Oct 24, 2017, 02:46 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
రేవంత్ కు షాక్ ఇచ్చేందుకు రంగంలోకి ఇంకో మంత్రి

సారాంశం

ఇద్దరు రేవంత్ అనుచరులకు వల వేసిన పట్నం త్వరలో టిఆర్ఎస్ గూటికి ఆ ఇద్దరు అనుచరులు ఇప్పటికే ఆకర్ష్ పనిలో బిజిగా ఉన్న పాలమూరు మంత్రులు

తెలంగాణ ప్రభుత్వానికి మింగుడపడని వ్యక్తిగా ముద్ర పడ్డ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేందుకు తాజాగా మరో మంత్రి రంగంలోకి దిగారు. ఇప్పటికే ఇద్దరు పాలమూరు మంత్రులు రేవంత్ అనుచరుల వేటలో బిజీగా ఉన్నారు. తాజాగా మరో వికారాబాద్ మంత్రి సైతం సీన్ లోకి ఎంటర్ అయ్యారు.

ఏం చేసైనా సరే రేవంత్ అనుచర గణాన్ని బుట్టలో వేసుకునేందుకు అధికార పార్టీ రకరకాల ఎత్తులు వేస్తున్నది. ఇటీవల కాలంలో తెలంగాణ భవన్ లో రేవంత్ అనుచరులను భారీగా చేర్చుకునేందుకు అధికార పార్టీ ప్లాన్ చేసినా అనుకున్నంతగా వర్కవుట్ కాలేదు. ఆ చేరిక వ్యవహారంలో పాలమూరుకు చెందిన జూపల్లి కృష్ణారావు, అవంచ లక్ష్మారెడ్డి కీ రోల్ ప్లే చేశారు. అయితే పెద్దగా ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కాలేదు.

తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ బరిలోకి దిగిపోయారు. ఆయన ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో ఇద్దరు రేవంత్ అనుచరులకు వల వేశారు. వారు నేడో రేపో కారెక్కడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. దౌల్తాబాద్ మండలంలోని టిడిపి నేతలు వెంటక్ రెడ్డి, మైపాల్ రెడ్డిలపై టిఆర్ఎస్ ఆకర్ష్ మంత్రం ప్రయోగించింది. వారితో చర్చలు ఫలప్రదమైనట్లు చెబుతున్నారు. త్వరలోనే వారు టిఆర్ఎస్ గూటికి చేరవచ్చని చెబుతున్నారు.

అయితే ఆ ఇద్దరిలో ఒక నాయకుడు పార్టీ మారడాన్ని తన కుటుంబంలో సొంత కూతురే వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మన కుటుంబానికి ఏ ఆపద ఉన్నా రేవంత్ రెడ్డి అండగా ఉన్నాడని అలాంటప్పుడు పార్టీ మారుడెందుకు అని ఆమె తన తండ్రిని అడ్డుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఆమె అడ్డుగోడగా ఉండడంతో జాయినింగ్ విషయంలో కొంత ఆలస్యమైందని చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ వారిద్దరూ టిఆర్ఎస్ లో చేరవచ్చని రేవంత్ శిబిరం కూడా అంచనాల్లో ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో ముగ్గురు మంత్రులు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుండగా మరో ముగ్గురు మంత్రులు తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. అయితే కొడంగల్ నుంచి జనాలను, టిడిపి నేతలను హైదరాబాద్ తరలించడంలో మాత్రం అనేక అవరోధాలను ఎదుర్కొంటున్నారని రేవంత్ శిబిరం అంటున్నది. అయితే చాప కింద నీరు మాదిరిగా రేవంత్ శిబిరం కూడా అధికార పార్టీలో అనేక మంది నేతలతో టచ్ లో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సందు చూసి దెబ్బ కొట్టేందుకు సైతం రేవంత్ వర్గం అచనాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!