
ఆమె ఎల్ బోర్డ్ కారు డ్రైవ్ చేసింది. వచ్చీరాని డ్రైవింగ్ చేస్తూ ఉత్త పుణ్యానికి ఇద్దరిని బలి తీసుకుంది. ఆ మహిళ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న సంఘటన వనస్థలిపురం లిమిట్స్ లో జరిగింది.
వివరాలిలా ఉన్నాయి.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజాపుర్ గ్రామము కమాన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. లెర్నింగ్ లైసెన్స్ తో కార్ డ్రైవింగ్ చేస్తూ రోడ్ పైకి వచ్చింది ఒక మహిళ.
డ్రైవింగ్ అంతంతమాత్రంగానే వచ్చినా... అతి వేగంతో కార్ నడిపింది.
ఇద్దరి మరణానికి కారణమయింది. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటున్న జంగయ్యతో పాటు బస్ కోసం వేచిచూస్తున్న జంగమ్మ అనే మహిళపై కారు దూసుకుపోయింది.
ఈ దుర్ఘటనలో వారు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. డ్రైవింగ్ చేసిన లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు.