కెసిఆర్ కు ఆ రెండు విషయాలంటే చాలా భయమట.

First Published Jul 8, 2017, 3:05 PM IST
Highlights

తెలంగాణ ఉద్యమ సారధి, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈటెల్లాంటి పదునైన మాటలతో ప్రత్యర్థులకు గుండెలదిరేలా పంచ్ లు విసిరడలో దిట్ట. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని నడిపించిన నాయకుడు. ఆమరణ దీక్షతో తెలంగాణ ఆవశ్యకతను దేశానికి చాటిన వ్యక్తి. కానీ అంతటి ధీరుడు సైతం ఆ రెండు విషయాల్లో మాత్రం చాలా భయపడతారట.

సిఎం కెసిఆర్ తన కంటి ఆపరేషన్ కోసం రెండుసార్లు ఢిల్లీ వెళ్లారు. కానీ ఆపరేషన్ చేయించుకోకుండానే వెనుదిరిగారు. దానికి అనేక కారణాలు బయట చెబుతున్నారు. కానీ అసలు కారణం వేరే ఉందట. ఆ విషయాన్ని సిఎం కెసిఆరే స్వయంగా పార్టీ నేతలతో సరదాగా పంచుకున్నారు. తనకు సూది అంటే చాలా భయమని సిఎం చెప్పారు. చిన్నప్పటి నుంచి గోలీలు తినేవాడిని కానీ, సూదులు వేయించుకునేవాడిని కాదని సిఎం చెప్పుకున్నారు. కంటి ఆపరేషన్ విషయంలోనూ ఢిల్లీలో డాక్టర్లు సూది వేస్తామని చెప్పి ఏర్పాట్లు చేస్తుండగానే కంటి ఆపరేషన్ ను సిఎం వాయిదా వేసుకుని హైదరాబాద్ వచ్చేశారట. అయితే కుటుంబసభ్యులు మాత్రం కంటి ఆపరేషన్ కోసం బలవంతంగా ఢిల్లీకి పంపడం, ఆయన ఏదో సాకుతో తిరిగి హైదరాబాద్ రావడం జరిగిపోతున్నాయని సరదాగా నేతలతో పంచుకున్నారు కెసిఆర్.

 

ఇక రెండో భయమేంటంటే చనిపోయిన వారి వద్దకు కెసిఆర్ వెళ్లడం చాలా అరుదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే ఆయన మృతదేహాల వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తుంటారు. సిఎం అయిన మూడేళ్ల కాలంలో అనేక మరణాలు జరిగినా సిఎం కెసిఆర్ సినారే వంటి వారి విషయంలో తప్ప చాలా చావుల విషయంలో కెసిఆర్ నివాళ్లు అర్పించేందుకు వెళ్లలేదు. సిఎంగా అయిన కొత్తలో మాచాయిపల్లి రైలు దుర్గటనలో చిన్నారులు చనిపోయినప్పుడు సిఎం అక్కడికి వెళ్లలేదు. మంత్రులను వెళ్లాలని పురమాయించారు. తర్వాత ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నవారిని మాత్రమే పరామర్శించారు. చాలా మంది తెలంగాణ ప్రముఖులు చనిపోయినా వారికి నివాళులు అర్పించేందుకు వెళ్లకుండా సంతాప సందేశాలు మీడియాకు పంపి ఊరుకున్నారు. అయితే సినారే మరణించినప్పుడు మాత్రం అంత్యక్రియలు జరిగే వరకు అక్కడే ఉండడం ఆశ్చర్యకరం.

 

పార్టీ నేతలు చెబుతున్న మాట ఏంటంటే కెసిఆర్ ది కవి హృదయం అని, అందుకే ఆయన మృతదేహాలను చూస్తే తట్టుకోలేరని, కన్నీరు పెట్టుకుంటారని అందుకే ఆయనను చావుల దగ్గరికి వెళ్లవద్దని తామే చెబుతుంటామని కెసిఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకులు చెబుతున్నారు.

 

మొత్తానికి ఎంతటి ధీరుడైనా చిన్న చిన్న విషయాల్లో వారు ఎంతగా భయపడతారో కెసిఆర్ ఒక ఉదాహరణగా నిలిచారు.

click me!