KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ పారిశ్రామిక విధానానికి చేయూత ఇవ్వాలని కోరారు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
KTR writes to FM Nirmala : తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ పారిశ్రామిక విధానానికి చేయూత ఇవ్వాలని కోరారు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాలని కేటీఆర్ ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఏర్పాటు చేసిన నాటి నుంచి పారిశ్రామిక రంగంతో పాటు అభివృద్ధి పథంలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక విధానానికి కేంద్రం ప్రభుత్వం సహాకారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ అంశంతో పాటు మరిన్ని అంశాలను కూడా కేటీఆర్ ఆ లేఖలో ప్రస్తావించారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నేషనల్ డిజైన్ సెంటర్ కు నిధులు అందించాలని , ఈ విషయంలో పలు మార్లు కేంద్రంతో చర్చిమని తెలిపారు. గతంలో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాదులో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో నేషనల్ డిజైన్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో
పారిశ్రామిక విధానంలోని ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు.
నేషనల్ డిజైన్ సెంటర్ కి సంబంధించి 8 యేండ్ల పాటు కేంద్రం నుంచి నిర్వహణ వ్యయానికి కోరుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఇందులో 25 శాతం భరించేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు నేషనల్ డిజైన్ సెంటర్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు.
అలాగే.. ఇండస్ట్రియల్ కారిడార్ కూడా నిధులు కేటాయించాలని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్ -నాగపూర్ పారిశ్రామిక కారిడార్ లను గుర్తించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- జహీరాబాద్ నోడ్ల (Nodes) అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని మరింత వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రతిపాదిత రెండు నోడ్లలో మౌళిక వసతుల కల్పన చేసేందుకు సుమారు రూ. 5000 కోట్లు ఖర్చు అవుతాయని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు హైదరాబాద్ నాగపూర్ కారిడార్ లో భాగంగా మంచిర్యాల్ నొడ్ ను కొత్తగా గుర్తించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లోని ఈ మూడు నోడ్లకు 2000కోట్ల రూపాయల చొప్పున మొత్తం 6000కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇక.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ – విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ లను జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ గుర్తించాలని. ఇందుకోసం తగిన ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ రెండు కారిడార్ల ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా స్వీకరించిందన్నారు. ఇప్పటికే హుజురాబాద్, జడ్చర్ల- గద్వాల్ – కొత్తకోట నొడ్లను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన డెవలమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతామని తెలిపారు.
అలాగే.. గత ఏడేండ్లుగా.. తెలంగాణ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మరియు ఏరోస్పేస్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్ ను చేర్చాలని మంత్రి కేటీఆర్ ఈ లేఖలో కోరారు.