తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అరుదైన గుర్తింపు

By Siva KodatiFirst Published Jan 23, 2022, 4:54 PM IST
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ (rural electrification corporation limited) నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుని లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm) కేసీఆర్‌ (kcr) మానస పుత్రికగా గుర్తింపు తెచ్చుచుని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం (kaleshwaram project) . ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ప్రాజెక్ట్‌కు తాజాగా మరో అరుదైన ఘనత దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌ (rural electrification corporation limited) నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించుకుని లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసింది.

రైతులకు గోదావరి (godavari water) జలాలను అందుబాటులోకి తీసుకురావడటంలో సఫలీకృతమైంది. కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ వద్ద శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల మధ్య అన్నారం, సుందీళ్ల గ్రామాల వద్ద కాలువలు, సోరంగ మార్గాలు, జలశాయాలు, నీటి పంపిణీ వ్యవస్థలు, ఎత్తి పోతల పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాలకు సాగు నీరు, తాగు నీరందించేందుకు కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెల్సిందే. అంతే కాకుండా ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు కావాల్సిన అన్ని రకాల అనుమతులను సీఎం సాధించారు. అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుని 2016 లో కేసీఆర్ సర్కార్‌ దీనిని ప్రారంభించింది.

click me!