కిషన్ రెడ్డిపై కేటీఆర్ సీరియస్.. సోదరుడిగా గౌరవిస్తా.. కానీ ఇది సరికాదు..అంటూ ట్వీట్..

By SumaBala Bukka  |  First Published Oct 1, 2022, 1:55 PM IST

తెలంగాణకు మెడికల్ కాలేజీల విషయంలో మంత్రి కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలే చెబుతున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 


హైదరాబాద్ :  మెడికల్ కళాశాల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు కేంద్రం 9 మెడికల్ కళాశాల ను మంజూరు చేసిందని కిషన్రెడ్డి చెప్పడంలో  ఏమాత్రం వాస్తవం లేదని  కేటీఆర్ అన్నారు . ఈ మేరకు తన ట్విటర్ ద్వారా కేటీఆర్ ప్రకటించారు. ‘ఓ సోదరుడిగా కిషన్ రెడ్డి ని ఎంతో గౌరవిస్తా’..  కానీ, అసత్య ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. అబద్ధాలు మాట్లాడే కిషన్ రెడ్డికి తన తప్పును అంగీకరించి ధైర్యం కూడా లేదు’ అని కేటీఆర్ విమర్శించారు. 

ఇదిలా ఉండగా,  శనివారం వరంగల్ పర్యటనలో ఉన్న కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రమంత్రులు ఇక్కడ విమర్శిస్తూ ఢిల్లీకి వెళ్లి అవార్డులు ఇస్తున్నారు అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు గతంలో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 5 మాత్రమే ఉండేవని తెలిపారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష వహిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం ఒక మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు.  మనమే 12కొత్త మెడికల్ కాలేజీలో తెచ్చుకుందామని అన్నారు మన విద్యార్థులు వైద్య విద్య కోసం  రష్యా,  చైనా,  వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. 

Latest Videos

undefined

మన విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు అవసరం లేదు.. సీఎం కేసీఆర్

రాష్ట్రంలోనే వైద్యవిద్య చదివేందుకు సరిపడా సీట్లు ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 6500 కు పెరిగిందన్నారు రాష్ట్రంలో 33 జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని అన్నారు.  భారత్ గొప్ప సహన శీల  దేశం అని పేర్కొన్నారు.  దేశంలో విద్వేషాలకు తావులేదని అన్నారు.  విద్వేష రాజకీయాలను యువత గ్రహించి జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.  ఈ దేశంలో కొంతమంది దుర్మార్గులు వాళ్ల స్వార్థ, నీచ ప్రయోజనాల కోసం విష బీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అది ఏ రకంగానూ సమర్థనీయం కాదని అన్నారు. 

click me!