హైదరాబాద్ లో మరో ప్రత్యేకత.. ఉప్పల్ స్కై వాక్ ను ప్రారంభించిన కేటీఆర్.. స్పెషాల్టీ ఏంటంటే.. (వీడియో)

By SumaBala Bukka  |  First Published Jun 26, 2023, 2:33 PM IST

ఉప్పల్ రింగ్ రోడ్ లో నిర్మించిన స్కై వాక్ కు సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 600 మీటర్ల మేరకు ఈ స్కైవాకును ఏర్పాటు చేశారు.


హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో కొత్త ఆకర్షణగా ఉప్పల్ స్కైవాక్ నిలవనుంది. ఉప్పల్ కూడలిలో హెచ్ఎండిఏ నిర్మించిన స్కైవాక్ ను పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 600 మీటర్ల మేరకు ఈ స్కైవాకును ఏర్పాటు చేశారు. కాలినడకన రోడ్డు దాటే వారు ఇబ్బంది పడకుండా.. ఎలాంటి వాహనాల గొడవ లేకుండా సులభంగా దాటడానికి ఈ స్కైవాక్ ఉపయోగపడుతుంది. దీనికోసం మొత్తం రూ.25 కోట్లు కేటాయించారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ కు.. ఉప్పల్,  సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతపూర్ లాంటి నాలుగు వైపులా రోడ్లతో అనుసంధానించారు.

Latest Videos

undefined

ఇక ఈ స్కైవాక్ పైకి మెట్లు ఎక్కలేనివారికోసం ఎస్కలేటర్లు… లిఫ్టులు కూడా ఏర్పాటు చేశారు. ఈ స్కైవాక్ పై ఎలాంటి అవాంచిత కార్యక్రమాలు జరగకుండా.. స్కైవాక్ పైన, కింద, చుట్టుపక్కల పరిసర  ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ స్కైవాక్ మీద పాదచారుల కోసం టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. గ్రీనరీతో స్కైవాక్ పరిసరాలను సుందరంగా తీర్చి దిద్దారు. పైనుంచి కింద పడకుండా.. స్కైవాక్  రెండు వైపులా రెయిలింగ్ ను  రక్షణగా ఏర్పాటు చేశారు. దీని మీద అమర్చిన ఎల్ఈడి దీపాలు  ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. స్కైవాక్ మీద నడిచే సమయంలో ఎండ పడకుండా ఉండడం కోసం రూఫ్ లు ఏర్పాటు చేశారు. వీటిని విదేశాల నుంచి తెప్పించారు.

స్కైవాక్ ప్రత్యేకలేంటంటే…
- ఈ స్కైవాక్ పొడవు.. 660 మీడర్లు.. వెడల్పు 3,4,6 మీటర్ల చొప్పున ఉంది. దీని నిర్మాణానికి రూ. 25 కోట్ల వ్యయం అయ్యింది.
- నగరంలోని నాలుగు ప్రాంతాల నుంచి ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్ కి అనుసంధానించారు. 
- ఉప్పల్ రింగురోడ్డులో నిత్యం 20వేల మంది పాదచారులు రాకపోకలు సాగిస్తారు. 
- మెట్రో స్టేషన్ నుంచి నిత్యం 25-30 వేలమంది ప్రయాణిస్తారు.
- టాఫిక్ కు అంతరాయం లేకుండా పాదచారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ స్కైవాక్ ఉపయోగపడుతుంది. 
 

click me!