ఆ సమస్యలతో విద్యార్థులతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నా.. వీసీలతో గవర్నర్ తమిళిసై సమావేశం..

Published : Jun 26, 2023, 02:01 PM IST
 ఆ సమస్యలతో విద్యార్థులతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నా.. వీసీలతో గవర్నర్ తమిళిసై సమావేశం..

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఈరోజు రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఈరోజు రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌.. వైస్ చాన్సలర్లతో పాటు యూజీసీ అధికారులను మాత్రమే పిలిచినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి  అధికారులకు గవర్నర్ నుంచి ఆహ్వానం అందలేని సమాచారం. ఇక, ఈ సమావేశం సందర్భంగా గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  విద్యార్థుల అభివృద్దే ప్రధాన లక్ష్యమని  చెప్పారు. దేశాభివృద్దికి ఉన్న విద్య అనేది  ఒక పిల్లర్ అని అన్నారు. 

రాజ్‌భవన్‌లో డిజిటల్ లైబ్రరీలను ప్రారంభిస్తున్నామని గవర్నర్ తమిళిసై చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యలతో విద్యార్థులతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నానని అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆరా తీశారు. విద్యార్థలు ఆత్మహత్యలపై అంతా ఆలోచించాలని అన్నారు. మంచి ప్రొఫెసర్లు, ట్యాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నా ర్యాకింగ్స్‌లో వెనకబడుతున్నామని  అన్నారు. విద్యార్థులను జాబ్ సీకర్స్‌గా కాకుండా జాబ్ క్రియేటర్స్‌గా యూనివర్సీటీలు  తీర్చిదిద్దాలని  చెప్పారు. ఇది  ఓపెన్ మీటింగ్ అని.. ఏ విషయమైనా తనతో చెప్పొచ్చని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?