జీహెచ్ఎంసీ మేయర్ గౌను.. కుట్టింది ఇతనే...

By AN TeluguFirst Published Feb 12, 2021, 9:44 AM IST
Highlights

జీహెచ్ఎంసీ మేయర్ వేసుకునే గౌనుకు ఓ ప్రత్యేకత ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ సమావేశంలో ఈ గౌనును ధరించే మేయర్ విధులు నిర్వర్తిస్తారు. అయితే ఈ గౌను వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగుంది. 

జీహెచ్ఎంసీ మేయర్ వేసుకునే గౌనుకు ఓ ప్రత్యేకత ఉంది. గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ సమావేశంలో ఈ గౌనును ధరించే మేయర్ విధులు నిర్వర్తిస్తారు. అయితే ఈ గౌను వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగుంది. 

1999 లో లీజ్ జుల్ఫికర్ అలీ మొదటిసారి మేయర్ అయినప్పటినుంచి ఇప్పటివరకు ఈ గౌన్లను ఒక్కరే కుడుతున్నారు. అతని పేరు ప్రవీణ్ కుమార్ బాహెతి. కోఠి బడీచౌడీలోని బీఎన్ దాస్ టైలర్స్ ఇతని షాపు పేరు. 

1999 లీజ్‌ జుల్ఫికర్‌ అలీ మేయర్‌ అయిననాటి నుంచి ప్రత్యేక గౌన్లను కుట్టడం ప్రారంభించారు. ఆ తరువాత తీగల కృష్ణారెడ్డి, బండ కార్తీక, మాజీద్ హుస్సేన్, బొంతు రామ్మోహన్ ల వరకు.. అతనే కుట్టాడు. ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మకి కూడా అతనే గౌను కుట్టాడు. దీంతో మేయర్లందరికీ ఇన్నేళ్లుగా గౌన్లు కుట్టిన రికార్డు తన సొంతం చేసుకున్నాడు. 

ఇతని స్టిచ్చింగ్ లో ఫర్ఫెక్ట్ నెస్, ముఖ్యంగా నాణ్యమైన మ్యాటిఫ్యాబ్రిక్స్‌, గోల్డెన్‌ లేస్‌లను ఉపయోగించి గౌనుకు హుందాతనాన్ని తీసుకువస్తాడు. ఈ గౌన్ల ధర కూడా మరీ అంత ఎక్కువేం కాదు.  వీటి ధర రూ.10వేల నుంచి రూ.60వేల వరకు ఉంటుందని ప్రవీణ్‌బాహెతి చెబుతున్నారు.

మేయర్ల గౌన్లు ఒక్కటే కాదు న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్స్‌, అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లకు, నల్సార్ కాన్వకేసష్ లకు ప్రత్యేక గౌన్లు కుట్టడంలో బాహెతీ దిట్ట. 

కోఠి బడీచౌడీలోని బీఎన్ దాస్ టైలర్స్ కూ పెద్ద చరిత్రే ఉంది. ఈ షాపును 1935లో బాహెతి తాత బన్సీలాల్‌ నారాయణ దాస్‌ స్థాపించారు. ఆ తరువాత తండ్రి ద్వారా బాహెతి ఈ విద్యను నేర్చుకున్నట్లు చెప్పారు. 

click me!