నామినేటెడ్ పదవులు: కెసిఆర్ ముస్లిం మురిపాలు

Published : Mar 01, 2017, 08:29 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నామినేటెడ్ పదవులు:  కెసిఆర్ ముస్లిం మురిపాలు

సారాంశం

కెసిఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లేయోచన చేస్తున్నాడనేందుకు పెద్ద ఎత్తున జరుగుతున్న  నియామకాలు నిదర్శనమా?

టీఆర్ఎస్ నాయకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల పంపకంలలో మైనారిటీలకు పెద్ద పీట వేశారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు..

ఈ రోజు 10 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో మైనారిటీలు  పెద్ద సంఖ్యలో ఉండటాని కి రాజకీయ ప్రాముఖ్యం ఉంది. వీరే మైనారిటీ ప్రతినిధులు.

 

 1.సెట్విన్ చైర్మన్ గా ఇనాయత్ అలీ,

2.ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా షేక్ బుడాన్ బేగ్,

 3. నెడ్ క్యాప్ చైర్మన్ గా అబ్దుల్ అలీమ్,

 4. ఖాదీ బోర్డు చైర్మన్ గా మహమ్మద్ యూసఫ్ జహీద్,

 5. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సయ్యద్ అక్బర్ హుస్సేన్.

 

ముస్లింలకు 12 రిజర్వేషన్ల నుఅమలుచేయడాన్ని ముఖ్యమంత్రి మూలన పడేశాడని  గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ గొడవచేస్తూ ఉంది. కోదండ రామ్ నాయకత్వంలోని జెఎసికూడా ఈవిషయాన్ని కేసిఆర్ గాలికి వదిలేసిన ఎన్నికల హామీ గా చెబుతూ వస్తున్నది. ఇలాంటపుడు ప్రకటించిన పదింటిలో అయిదింటిని మైనారిటీల కు కేటాయించడం, ఈ విమర్శను తిప్పికొట్టేందుకే ననుకోవాలి.

 

ఇక మిగతా నియమకాలలో  ముఖ్యమయినది రాజ్యసభ సభ్యుడు కె కెశరావు కుమారుడు విప్లవ్ కుమార్ ను అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం. బహుశా,  ఏమ్మాట్లాడకుండా గమ్మున కూర్చున్నుందుకు కేశవరావుకిది బహుమానం కావచ్చు. లేకుంటే నోరున్న కెకె ఏదో ఒకటి మాట్లాడి కెసిఆర్ ని కొంత ఇబ్బంది కల్గించి ఉండే వాడే. నోటికి తాళం వేసుకోవడం కెకె  ఎంతకష్టం. అందుకే పరిహారం.ఆయన గొంతు వినక సంవత్సరాలవుతున్నది.

 

మిగతావారిలో సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొండబాల కోటేశ్వరరావు, గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా తాటి వెంకటేశ్వర్లు, హ్యాండీ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా సంపత్ కుమార్ గుప్తా, ఎడ్యుకేషన్ అండ్ వెల్ ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా గౌండ్ల నాగేందర్ గౌడ్ లనుముఖ్యమంత్రి నియమించారు.

 

బిజెపి చెబుతున్నట్లు, పెద్ద ఎత్తున జరుగుతున్న  ఈ నియమాకాలు కూడా కెసిఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లేయోచన చేస్తున్నాడనేందుకు నిదర్శనమా?

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu