హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

By narsimha lodeFirst Published Nov 15, 2018, 1:00 PM IST
Highlights

హైద్రాబాద్‌లో ఎవరూ ఏం చేశారనే విషయమై  ప్రజలు తేలుస్తారని  తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ చెప్పారు. 

హైదరాబాద్: హైద్రాబాద్‌లో ఎవరూ ఏం చేశారనే విషయమై  ప్రజలు తేలుస్తారని  తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  కేటీఆర్ చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన  హైద్రాబాద్‌కు ఎవరు ఏం చేశారో ప్రజలు తేలుస్తారని  ఏపీ సీఎం చంద్రబాబుకు తేల్చి చెప్పారు.

గురువారం నాడు  సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన  మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైద్రాబాద్‌పై  చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించారు.

హైద్రాబాద్‌ను పేరును తాను ప్రపంచస్థాయికి గుర్తింపు తీసుకువచ్చినట్టు చెప్పారు. కానీ, కేసీఆర్ మాత్రం దాన్ని  కేసీఆర్ సరిగా ఉపయోగించుకోవడం లేదన్నారు.ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ గురువారం నాడు స్పందించారు. చంద్రబాబునాయుడు మాదిరిగా సెల్ప్ సర్టిపికేషన్ అవసరం లేదన్నారు.

పరిశ్రమలకు  సెల్ప్ సర్టిఫికేషన్ పద్దతిని  రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. హైద్రాబాద్‌లో ఎవరూ ఏం చేశారో నాలుగు ఏళ్లుగా హైద్రాబాద్ ప్రజలకు తెలుసునని చెప్పారు.

తమకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా చెప్పుకొన్నారు. కానీ, పార్లమెంట్ సాక్షిగా  నరేంద్ర మోడీ కేసీఆర్ పాలన గురించి ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. చంద్రబాబుకు పరిపాలన అనుభవం ఉండొచ్చు.. కానీ, పరిపాలనను వదిలేసి బాబు గిల్లికజ్జాలు పెట్టుకొంటున్నారని చెప్పారు. 

కానీ, పరిపాలన అనుభవం లేకున్నా కేసీఆర్ మాత్రం రాష్ట్ర అవసరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని పార్లమెంట్ వేదికగా మోడీ మాట్లాడిన విషయాలను ఆయన గుర్తు చేశారు. హైద్రాబాద్‌కు ఎవరూ ఏం చేశారో డిసెంబర్ 7వ తేదీన  ప్రజలు నిర్ణయిస్తారని చంద్రబాబుపై  కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబునాయుడు  మాదిరిగా తాము గొప్పలు చెప్పుకోమని కేటీఆర్ చెప్పారు. తాను  బుధవారం నాడు  ఖమ్మం జిల్లాలోని తాను మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించానని చెప్పారు. ఈ మూడు నియోజకవర్గాలు ఏపీకి సరిహద్దులో ఉంటాయని చెప్పారు.తెలంగాణలో, ఏపీ పాలనను పోల్చి చూడాలని తాను ఆ నియోజకవర్గాల ప్రజలను కోరినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

 

click me!