ఏ ప్రధానిని రోడ్డుపై ఆపలేదు, కేసీఆర్ రైతులకు ఏటీఎంలాంటివాడే: జేపీ నడ్డాపై కేటీఆర్ ఫైర్

Published : Jan 05, 2022, 04:39 PM ISTUpdated : Jan 05, 2022, 04:50 PM IST
ఏ ప్రధానిని రోడ్డుపై ఆపలేదు, కేసీఆర్ రైతులకు ఏటీఎంలాంటివాడే: జేపీ నడ్డాపై కేటీఆర్ ఫైర్

సారాంశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై టీఆర్ఎస్ సర్కార్ చేసిన విమర్శలపై  తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీ సర్కార్ పై మంత్రి కేటీఆర్ సీరియర్ వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ ఏటీఎం లాంటి వాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం నాడు క్యాండిల్ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ అన్నదాతలకు తోడుండే మిషన్ అంటూ కేటీఆర్ చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. అయినా కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన తమను అభినందించకపోగా ఈ ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం అంటూ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ అదే స్థాయిలో సమాధానమిచ్చారు.  కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘం సభ్యులు కితాబిచ్చిన విసయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 

also read:టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యం.. పోరాటం మరింత ఉద్ధృతం : హైదరాబాద్‌లో జేపీ నడ్డా

Bjp తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay కి, జాతీయ అధ్యక్షుడు JP Nadda కు పెద్ద తేడా లేదని మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. జేపీ నడ్డా చాలా చిల్లరగా మాట్లాడారన్నారు.  బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అంటూ కేటీఆర్ తెలిపారు. జేపీ నడ్డా  వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు.  నిన్నటి వరకు జేపీ నడ్డా అంటే ఒక గౌరవం ఉండేదన్నారు. నిన్నటితో ఆ గౌరవం పోయిందన్నారు.  జేపీ నడ్డాను ఎర్రగడ్డకు పంపాలన్నారు.

Narendra Modi పెద్ద రైతు విరోధి అన్నారు. రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందునే పంజాబ్ రాష్ట్రంలో  ప్రధాని మోడీని Farmers  20 నిమిషాలు అడ్డుకొన్నారని Ktr చెప్పారు. దేశంలో ఏ ప్రధానిని ఈ రకంగా 20 నిమిషాల పాటు రోడ్డుపైనే అడ్డుకొన్న చరిత్ర లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.

రైతులను ఇంత గొప్పగా గోసపుచ్చుతున్న సర్కార్ మరోటి లేదని ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. 2022 లో ప్రతి భారతీయుడికి ఇల్లు అని మోడీ ఇచ్చిన హామీని అమలు చేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు.  ఇంటింటికి నల్లా, మరుగుదొడ్డి, విద్యుత్ అని మోడీ ఇచ్చిన హామీని కేటీఆర్ ప్రస్తావించారు. కనీసం ఎక్కడైనా ఈ హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు. కనీసం గుజరాత్ లోనైనా ఈ పథకం అమలైందా అని కేటీఆర్ అడిగారు. మోడీ ఇన్నేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏదైనా కార్యక్రమం ఉందా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం  చేపట్టిన పథకాలను మోడీ సర్కార్ కాపీ కొట్టిందని ఆయన ప్రస్తావించారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టలేదా అంటూ మంత్రి ప్రశ్నించారు.

 ఢీల్లీలో వరి ధాన్యం కొనుగోలు చేయమని చెబుతారు తెలంగాణలో మాత్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు, దీక్షలు చేయడం బీజేపీకే చెల్లిందని కేటీఆర్ మండిపడ్డారు.  మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కూడా  నిధులు ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులను కేంద్ర మంత్రులే స్వయంగా అభినందించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

 95 శాతం స్థానికులకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశ్యంతో 317 జీవోను తీసుకొచ్చిందన్నారు. తమకు ఉద్యోగులకు పేగు బంధం ఉందన్నారు. ఉద్యోగుల సంఘం నేతనే తమ కేబినెట్ లో మంత్రిగా ఉన్నాడని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కోవిడ్ గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం  కోవిడ్ గైడ్ లైన్స్ ను పాటించనని చెప్పడం సరైందేనా అని మంత్రి ప్రశ్నించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం