Medical Devices Park ను ప్రారంభించిన మంత్రి KTR

Published : Dec 15, 2021, 09:29 PM IST
Medical Devices Park ను  ప్రారంభించిన మంత్రి KTR

సారాంశం

Medical Devices Park: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్కు (మెడికల్ డివైజెస్ పార్క్) సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఒకే రోజు ఏడు కంపెనీలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.    

Medical Devices Park : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన భారతదేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ పార్కు (మెడికల్ డివైజెస్ పార్క్) ప్రారంభించి, సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఒకే రోజు ఏడు కంపెనీలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.  హైద‌రాబాద్‌కు స‌మీపంలోని సుల్తాన్‌పూర్‌లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన స్టెంట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలు  వ‌చ్చే ఏడాది ఏప్రిల్, మే వ‌ర‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు. ఈ కంపెనీనిల‌ను ఎస్ఎంటీ నిర్మిస్తోందని , మెడిక‌ల్ డివైజెస్ రంగంలో భార‌త‌దేశానికి తెలంగాణ ఓ కేంద్రంగా మారుతోంద‌ని  కేటీఆర్ పేర్కొన్నారు. వైద్య పరికరాలు, లైఫ్‌ సైన్సెస్ మొద‌లైన వాటి త‌యారీ కోసం మెడికల్‌ డివైజెస్‌ పార్క్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 302 ఎకరాలు కేటాయించారు.  
 
ప్రొమియా థెరప్యూటిక్స్, హ్యూవెల్ లైఫ్ సైన్సెస్, అక్రితి ఓక్యులోప్లాస్టీ, ఆర్కా ఇంజనీర్స్, SVP టెక్నో ఇంజనీర్స్, ఎల్వికాన్ మరియు రీస్ మెడిలైఫ్ వంటి కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ప్రారంభించాయి. ఇందుకోసం రూ. 265 కోట్ల పెట్టుబడితో ప్రారంభించామ‌నీ, 1300 మందికి ఉదోగ్య క‌ల్ప‌న జ‌రుగుతోంద‌ని కేటీఆర్ తెలిపారు. 2030 నాటికి తెలంగాణను 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మలిచేందుకు ఇదొక కీలక ముందడగు అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also : MLC elections : రవీందర్ సింగ్‌పై కరీంనగర్ మేయర్ సంచలన వ్యాఖ్యలు

భార‌త్ దాదాపు 78 శాతం మెడిక‌ల్ ప‌రిక‌రాల‌ను ఇత‌ర దేశాల‌ను దిగుమ‌తి చేసుకుంటుందనీ, ఈ స‌మ‌స్య‌పై   గ‌త మూడేండ్ల కింద బ‌యో ఏషియా స‌ద‌స్సుల్లో మెడిక‌ల్ డివైజెస్ త‌యారీదారుల‌తో మాట్లాడాననీ, ఈ క్ర‌మంలో వారు భార‌త్‌లో కానీ , తెలంగాణ‌లో కానీ మెడిక‌ల్ డివైజెస్ ఉత్ప‌త్తికి ఏం స‌దుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నాన‌నీ తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో  గ్లౌజ్‌లు, మాస్కులు చైనా నుంచి దిగుమ‌తి చేసుకునే కంటే.. ఇక్క‌డ త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తున్నాయ‌ని తెలిపారు. 

ఈ సదుపాయం ఇప్పుడు సైంటిస్టులు మరియు లైఫ్ సైన్సెస్ సెగ్మెంట్లో ఎంటర్‌ప్రెన్యూర్ కమ్యూనిటీకి వన్ స్టాప్ ఫెసిలిటీగా మారుతున్నప్పటికీ, కాన్సెప్ట్ దశలో అవసరమైన ప్రక్రియలను పొందడం అంత తేలికైన పని కాదని కేటీఆర్ అన్నారు.  రాబోయే కొన్నేళ్లు తెలంగాణలో అసమానమైన ఆర్థిక వృద్ధికి నాంది ప‌లుకుతోంద‌ని తెలిపారు.

Read Also : గవర్నర్‌ను పరామర్శించిన CM YS Jagan దంపతులు

అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఒక ఆలోచ‌న‌తో, ఒక వ్యూహాంతో హైదరాబాద్ లో లైఫ్ సైన్సెస్ టెక్నాలజీని బ‌లోపేతం చేస్తున్నామ‌నీ, తెలంగాణను హెల్త్‌కేర్ హబ్‌గా మార్చ‌బోతున్నామ‌ని అన్నారు. హైదరాబాద్‌లో ప్లాస్టిక్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర విషయాలలో నైపుణ్యం కలిగిన అనేక కంపెనీలు ఉన్నాయి.  ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఫార్మా క్ల‌స్ట‌ర్‌ను ఏర్పాటు చేయ‌బోతున్నామ‌నీ. జీనోమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తున్నామ‌నీ. ప్ర‌పంచంలో త‌యార‌య్యే మూడో వంతు వ్యాక్సిన్లు తెలంగాణ‌లోనే త‌యారవుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్.

హైద‌రాబాద్‌లో పారిశ్రామిక కాలుష్యం ఉండ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో అలాంటి ప‌రిశ్ర‌మ‌ల‌ను ఓఆర్ఆర్ బ‌య‌ట‌కు త‌ర‌లిస్తున్నామనీ, గ‌త నాలుగేండ్ల కింద‌ట ఈ పార్కు శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఉన్నా.. న‌గ‌రం ఇప్పుడూ చాలా అభివృద్ధి చేందింద‌నీ,  సాగుకు యోగ్యంగా లేని ఈ ప్రాంతంలో 50 కంపెనీలు వివిధ స్థాయిల్లో నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. ఇవాళ ఏడు కంపెనీల‌ను ప్రారంభించుకున్నాం. మిగ‌తా వాటిని కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించుకుంటాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu