హైదరాబాద్‌కు అన్ని అనుకూలతలు.. తెలంగాణ పథకాలను కేంద్రం ఫాలో అవుతుంది.. మంత్రి కేటీఆర్

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 1:08 PM IST
Highlights

జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2  నీటి సరఫరా పనులకు (water supply scheme) మంత్రి కేటీఆర్ (KTR) సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.587కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఓఆర్‌ఆర్‌ పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు నీటి సరఫరా చేయనున్నారు.

జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2  నీటి సరఫరా పనులకు (water supply scheme) మంత్రి కేటీఆర్ (KTR) సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.587కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఓఆర్‌ఆర్‌ పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు నీటి సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉందని.. హైదరాబాద్‌కు మాత్రమే అన్ని కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు మొత్తం దేశానికి స్ఫూర్తి దాయకమన్నారు. తెలంగాణలో ఈ రోజు అమలు అవుతున్న పథకాలు.. దేశంలో రేపు అమలు అవుతున్నాయన్నారు. తెలంగాణలో తీసుకొచ్చిన రైతు బంధును పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తున్నారు. 

సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక.. మొదటగా విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపించారని అన్నారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. ORR లోపల ఉన్న మున్సిపాలిటీలను హైదరాబాద్ కిందనే పరిగణిస్తున్నట్టుగా చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. 

ఢిల్లీ, చెన్నై, ముంబై, కోలక‌తా నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయన్నారు. హైదరాబాద్‌ నగరంలో అన్ని అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ప్లానింగ్ చేయమని కేసీఆర్ చెప్పినట్టుగా కేటీఆర్ వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని ఆవాసాలకు రూ.1200 కోట్ల వ్యయంతో నీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకే రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కాళేశ్వర ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి తాగునీరు కూడా సరఫరా చేస్తామని తెలిపారు. కొండ పోచమ్మసాగర్‌ నీటితో గండిపేట చెరువును నింపాలనేది సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు.

గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలకు వెళ్తే ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారని అన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఖైరతాబాద్‌లోని జలమండలి ఆఫీస్‌ ఎదుట మహిళలు ధర్నాలకు దిగేవారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పారు. 

click me!