జమిలి ఎన్నికలొచ్చే ఛాన్స్, సిట్టింగ్‌లను మార్చని చోటే ఓటమి: కేటీఆర్

Published : Dec 06, 2020, 05:39 PM IST
జమిలి ఎన్నికలొచ్చే ఛాన్స్, సిట్టింగ్‌లను మార్చని చోటే ఓటమి: కేటీఆర్

సారాంశం

జమిలి ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి  కేటీఆర్ చెప్పారు.ఈ ఎన్నికలకు కూడా సిద్దంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.  

హైదరాబాద్: జమిలి ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి  కేటీఆర్ చెప్పారు.ఈ ఎన్నికలకు కూడా సిద్దంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

ఆదివారం నాడు జీహెచ్ఎంసీలో కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు, నగరానికి చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లను దిశా నిర్ధేశం చేశారు.

also read:ఈ నెల 8న భారత్ బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: కేటీఆర్

ఓడిపోయినవాళ్లని చులకనగా చూడొద్దని  కేటీఆర్ కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి భావోద్వేగ ఎన్నికలు జరిగాయన్నారు.  హైద్రాబాద్ లో కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకొని నగర అభివృద్దికి పాటుపడాలని ఆయన సూచించారు. 

సిట్టింగ్ కార్పోరేటర్లను మార్చని చోట ఓటమి పాలైనట్టుగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు.గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న నిరాశలో ఉండొద్దని ఆయన పార్టీ క్యాడర్ ను కోరారు.గ్రేటర్ ఎన్నికలను ఒక అనుభవంగా తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

త్వరలోనే ఎమ్మెల్సీ  ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలపై దృష్టిని కేంద్రీకరించాలని ఆయన పార్టీ క్యాడర్ ను కోరారు. ఈ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!