కొత్తగా ఎన్నికైన కార్పోరేట్లతో కేటీఆర్ భేటీ: కీలక అంశాలపై చర్చ

Published : Dec 06, 2020, 04:22 PM IST
కొత్తగా ఎన్నికైన కార్పోరేట్లతో కేటీఆర్ భేటీ: కీలక అంశాలపై చర్చ

సారాంశం

 కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు

హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు సమావేశమయ్యారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ 54 కార్పోరేటర్లను కైవసం చేసుకొంది. కొత్తగా ఎన్నికైన కార్పోరేట్లతో పాటు నగరానికి చెందిన టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు చెందిన కేటీఆర్ సమావేశమయ్యారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మేయర్ ఎన్నిక సమయంలో  అనుసరించాల్సిన వ్యూహాంపై  కూడ కేటీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

స్వంతంగా మేయర్ పదవిని దక్కించుకొనే అవకాశం ఉందా అనే విషయమై కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ  ఎంఐఎంతో పొత్తు పెట్టుకొంటే ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయి.. వాటిని ఎలా అధిగమించాలనే విషయమై కూడా పార్టీ నేతలతో కేటీఆర్ చర్చిస్తున్నారని సమాచారం.

గతంలో కంటే అధిక స్థానాల్లో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ ధీమాతోనే ఎన్నికల బరిలోకి దిగింది. కానీ ఎన్నికల పలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. 

పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు ఎందుకు వచ్చాయనే విషయమై  కేటీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న
Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu