మురికి వాడల జనాలకు కేటిఆర్ షాక్

Published : Aug 31, 2017, 07:27 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
మురికి వాడల జనాలకు కేటిఆర్ షాక్

సారాంశం

మురికి వాడల జనాలు తమ స్ధలాలు ఇవ్వాలి అలా జాగాలిచ్చిన వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు స్పష్టం చేసిన మున్సిపల్ మంత్రి కేటిఆర్ మల్కాజ్ గిరి అభివృద్ధిపై కేటిఆర్ సుదీర్ఘ సమీక్ష

మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని అభివృద్ది కార్యక్రమాలపైన పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు  బేగంపేట మెట్రోరైల్ కార్యాలయంలో ఈ రోజు సమీక్ష జరిపారు. మల్కాజ్‌గిరి నియోజక వర్గ పరిధిలోని శాసన సభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఏంఎల్సీలు, నగర మేయర్, మంత్రి మహేందర్ రెడ్డిలు ఈ సమీక్ష సమావేశంలో పాల్గోన్నారు. 

మురికి వాడల్లో తమ స్ధలాలను ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిచ్చి ఇస్తామన్నారు మంత్రి కేటిఆర్. నగరంలోని చుట్టుపక్కల కడుతున్న చోట పక్కా ప్రణాళిక ద్వారా అయా ప్రాంతాల్లోని పేదలకే అందిస్తామన్నారు. గతంలో మాదిరి సూదూరంగా కాకుండా క్యాచ్ మెంట్ ఏరియాలను ఏర్పాటు చేసుకుని సాద్యమైనంత దగ్గరలో ఇళ్లను ఇస్తామన్నారు. ఇందుకోసం పక్బందీ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను కోరారు.

గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు అప్లికేషన్ చేసుకోని వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని యంఏల్యేలు కోరారు. గతంలోనే లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని, మిగిలిన వారికి దరఖాస్తు చేసుకునే అం శంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కెటి రామారావు తెలిపారు. మల్కాజ్‌గిరి ప్రాంతంలో వాటర్ వర్క్స్ చేపట్టిన పనులను అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, రోడ్లు, వాటర్ వర్క్స్, ఎస్సార్డీపి, లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు ఏవిధంగా ముందుకు వెలుతున్నాయి, మల్కాజ్‌గిరి పరిధిలోని ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి, యంఏల్యేలకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని కోరారు. ఇందుకోసం అవసరం అయిన ప్రణాళికల రచన, కార్యక్రమాల అమలుపైన ఏప్పటికప్పుడు సమావేశం అయి చర్చిద్దామని మంత్రి వారికి తెలిపారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో సూమారు 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

రాజకీయాలు ప్రక్షాళన చేద్దాం రండి : కమల్

 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్