తెలంగాణలో మళ్లీ కొత్త కొలువుల జాతర

Published : Aug 31, 2017, 06:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తెలంగాణలో మళ్లీ కొత్త కొలువుల జాతర

సారాంశం

2008 తర్వాత ప్రారంభించిన 81 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 1133 పోస్టుల మంజూరు 15 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉర్ధూ మీడియంలో నడుస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ సెక్షన్లకు 69 జూనియర్ లెక్చరర్ల పోస్టుల మంజూరు పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల వేతనాలు రెండింతలు పెంపు o పార్ట్ టైం ల్యాబ్ అటెండర్ల వేతనాలు 3,900 నుంచి 7,800కు పెంపు ఎస్.ఎస్.ఏ, కస్తూర్భాగాంధీ విద్యాలయాల ఉద్యోగులకు పెరిగిన గౌరవ వేతనాలు

తెలంగాణలో కొలువుల జాతరకు మరోసారి సర్కారు తెర లేపింది. విద్యాశాఖలో కొత్త పోస్టులు మంజూరయ్యాయి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు గౌరవ వేతనాలు పెరిగాయి. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్.ఎస్.ఏ, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల బోధన, బోధనేతర ఉద్యోగుల గౌరవ వేతనాల పెంపునకు సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారు. 2008 తర్వాత ప్రారంభించిన 81 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1133 పోస్టులను ముఖ్యమంత్రి కేసిఆర్ మంజూరు చేశారు. దీంతో 2008 నుంచి మంజూరు కానీ పోస్టుల్లో కాంట్రాక్టు పద్దతిపై నడుస్తున్న ఈ విధానానికి మోక్షం లభించింది.

2008 తర్వాత ఈ 81 జూనియర్ కాలేజీలకు పలు దఫాలుగా మంజూరు ఇచ్చినా...అక్కడ కావల్సిన బోధన, బోధనేతర పోస్టులను మాత్రం మంజూరు చేయలేదు. దీంతో కాంట్రాక్టు విధానంలో బోధన , బోధనేతర సిబ్బందితో ఈ 81 కాలేజీలు నడుస్తున్నాయి. కాంట్రాక్టు పద్దతిలో కాలేజీలను నడపడం వల్ల నాణ్యమైన విద్యనందించలేకపోతున్నామని, రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలని చేసిన విజ్ణప్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆమోదించారు. దీంతో ఈ 81 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 1133 పోస్టులు మంజూరు అయ్యాయి.

సెల్ఫ్ ఫైనాన్స్ భారం నుంచి ఉర్దూ మీడియం సెక్షన్లకు విముక్తి 15 ఉర్ధూ మీడియం ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద నడుస్తున్న 21 సెక్షన్లకు సంబంధించి 69 జూనియర్ లెక్చరర్ల పోస్టులను కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ మంజూరు చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల విద్యార్థులపై ఆర్ధిక భారం పడుతోంది. దీనిని గమనించిన ప్రభుత్వం ఈ 15 కాలేజీలకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తానే నడిపే విధంగా అవసరమైన 69 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఆర్ధిక భారం లేకుండా, ప్రభుత్వం ఏటా 1,86,30,000 రూపాయలు భరించనుంది. వీరికి కాంట్రాక్టు పద్దతిలో నియమించే ఒక్కో ఉర్దూ మీడియా జూనియర్ లెక్చరర్ కు ఇకనుంచి 27వేల రూపాయల వేతనం అందనుంది.

ఒకవైపు అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేస్తూనే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులకు వేతనాలు పెంపు చేశారు. 63 మంది పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ల వేతనాలు డబుల్ చేశారు. ప్రస్తుతం ఈ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లకు ఒక్కో పీరియడ్ కు 150 రూపాయలు చెల్లిస్తుండగా...కొత్తగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తం 300 రూపాయలకు పెరిగింది. ఒక్కో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్ కు నెలకు 72 పీరియడ్ ల చొప్పున గతంలో 10,800 రూపాయల వేతనం పొందుతుండగా తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల వీరి వేతనం నెలకు 21,600 కు పెరిగింది. అదేవిధంగా 52 మంది పార్ట్ టైం ల్యాబ్ అటెండర్ల వేతనాన్ని 3,900 రూపాయల నుంచి 7,800 కు పెంచారు. దీనివల్ల ప్రభుత్వంపై 88,32,000 రూపాయల అదనపు భారం పడనుంది.

ఎస్.ఎస్.ఏ, కేజీబీవీలలో ఉద్యోగుల గౌరవ వేతనాల పెంపు సర్వశిక్ష అభియాన్, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 11, 839 మందికి గౌరవ వేతనాలు పెంచారు. ఇందులో సర్వశిక్ష అభియాన్ కు చెందిన 2690 మంది పార్ట్ టైం ఇన్ స్ట్రక్టర్ల గౌరవ వేతనాన్ని 6000ల నుంచి 9000 రూపాయలకు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ కు 11,400 నుంచి 15,00 రూపాయలకు, ఎం.ఐ.ఎస్ కో-ఆర్డినేటర్లకు 13వేల నుంచి 15,000 రూపాయలకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు 12,000 నుంచి 14,000 రూపాయలకు, మెస్సెంజర్లకు 8,000 నుంచి 8,500 రూపాయలకు, సిస్టమ్ అనలిస్టులకు 15,000 నుంచి 16, 500 రూపాయలకు, సీరియర్ ప్రోగ్రామ్ టెక్నికల్ కన్సల్టెంట్ కు 35,000 నుంచి 40,000 రూపాయలకు, కన్సల్టెంట్లకు 25,000 నుంచి 35,000 రూపాయలకు, డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు 16,500 నుంచి 17,500 రూపాయలకు, డ్రైవర్లకు 13,000 నుంచి 15,000 రూపాయలకు, అటెండర్లకు 10,000 నుంచి 12,000రూపాయలకు వేతనాలు పెంచారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 391 మంది స్పెషల్ ఆఫీసర్ల గౌరవ వేతనాన్ని 21,000 నుంచి 25,000 రూపాయలకు, 2737 మంది సీఆర్టీలకు 15,000 నుంచి 20,000 రూపాయలకు, 391 మంది అకౌంటెంట్లకు 10,000 నుంచి 11,000 రూపాయలకు, 391 మంది ఎ.ఎన్.ఎంలకు 9000 నుంచి 11,000 రూపాయలకు, 391 పీఈటీలకు 11,000 నుంచి 12,000 రూపాయలకు, 782 మంది ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్లకు 5000 నుంచి 6000 రూపాయలకు పెంచారు.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజకీయాలు ప్రక్షాళన చేద్దాం రండి : కమల్

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!