ఏప్రిల్ 8న సింగ‌రేణి ప్రాంతాల్లో మ‌హా ధ‌ర్నాలు.. కేటీఆర్ పిలుపు.. అదే రోజు హైదరాబాద్‌లో మోదీ పర్యటన..!

Published : Apr 06, 2023, 05:11 PM IST
ఏప్రిల్ 8న సింగ‌రేణి ప్రాంతాల్లో మ‌హా ధ‌ర్నాలు.. కేటీఆర్ పిలుపు.. అదే రోజు హైదరాబాద్‌లో మోదీ పర్యటన..!

సారాంశం

బీఆర్ఎస్ పార్టీ  ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  నిరసన కార్యక్రమాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. 

హైదరాబాద్‌: బీఆర్ఎస్ పార్టీ  ఈ నెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  నిరసన కార్యక్రమాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం సాక్షిగా సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమని చెప్పి మాట తప్పారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. లాభాల్లో ఉన్న సిగ‌రేణిని ప్ర‌యివేటీక‌రించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అని ప్ర‌శ్నించారు. వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొగ్గు బావుల వద్ద నిరసన కార్యక్రమాలకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాలలో మహా ధర్నాలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఖమ్మం బీఆర్‌ఎస్ నాయకులు భారీ నిరసనకు ప్లాన్ చేశారు. 

అయితే ఏప్రిల్ 8వ తేదీనే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నిరనసనలకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టెన్త్ పేపర్ లీక్ కేసులో టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సంగతి తెలిసిందే.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు