ఈ నెల 9న జలసౌధలో జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ అత్యవసర భేటీ నిర్వహించనున్నట్టుగా కేఆర్ఎంబీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సమాచారం అందించింది.
హైదరాబాద్:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నారు. ఇటీవల కాలంలో నిర్వహించిన ఉమ్మడి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు.దీంతో ఈ నెల 9వ తేదీన మరోసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కేంద్రప్రభుత్వం ఇటీవలనే గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్రం . ఈ గెజిట్ ను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
also read:కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉమ్మడి భేటీ: ఆ ప్రాజెక్టుల వివరాలివ్వలేమన్న ఏపీ, తెలంగాణ డుమ్మా
గెజిట్ నోటిఫికేషన్లలోని నిర్ణయించిన అంశాలను గడువులోపుగా అమలయ్యేలా తేదీలవారీగా ప్రణాళికలు తయారు చేసి పంపాలని కేంద్ర జల్‌శక్తిమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మెన్లకు లేఖలు రాశారు.ఈ నెల 9వ తేదీన హైద్రాబాద్ జలసౌధలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కేఆర్ఎంబీ ప్రకటించింది.ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు కేఆర్ఎంబీ సమాచారం పంపింది.గత సమావేశానికి హాజరుకాని తెలంగాణ అధికారులు ఈ నెల 9వ తేదీన జరిగే సమావేశానికి హాజరౌతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.