హుజూరాబాద్ బైపోల్: అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు, కృష్ణారెడ్డి పేరు పరిశీలన

By narsimha lodeFirst Published Aug 13, 2021, 4:15 PM IST
Highlights

హుజూరాబాద్ లో పోటీ  చేసే అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కిసాన్ సెల్ నేత కృష్ణారెడ్డి పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. కాంగ్రెస్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపనుంది.

హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుండి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి.టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు.

also read:హుజూరాబాద్ బైపోల్: ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్, బీజేపీ, అభ్యర్థి వేటలోనే కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం నుండి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నిలిపింది. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు దక్కాయి.  ఈ దఫా  కూడ రెడ్డి సామాజిక వర్గం నుండే అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లున్నారు. 1.10 లక్షల మంది బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. 50 వేల మంది దళిత సామాజికవర్గం ఓటర్లున్నారు.  రెడ్డి సామాజికవర్గం నుండి 22 వేల మంది ఓటర్లున్నారు.

బీజేపీ, టీఆర్ఎస్‌లు బీసీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నందున రెడ్డి సామాజికవర్గం నుండి బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.  కిసాన్ సెల్ నేత కృష్ణారెడ్డి పేరును ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది.

రేపు పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. గురువారం నాడు హుజూరాబాద్ నేతలతో దామోదర రాజనర్సింహ వీడియో కాన్షరెన్స్ లో మాట్లాడారు. అభ్యర్ధి ఎంపికపై చర్చించారు.

click me!