బీఆర్ఎస్ కు సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు.
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితికి సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారంనాడు రాజీనామా చేశారు. ఈ నెల 14న కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కోనేరు కోనప్ప ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యులతో భేటీ అయిన విషయం తెలిసిందే.
also read:గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు: ఏపీ హైకోర్టు కీలక తీర్పు
undefined
గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఇవాళ కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన అనుచరులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి ఈ నెల 14న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
also read:ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకేసులో కీలకమలుపు: విచారణ సిట్ కు అప్పగింత
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2014లో బీఎస్పీ నుండి కోనప్ప విజయం సాధించారు. ఆ తర్వాత బీఎస్పీని బీఆర్ఎస్ లో విలీనమైన విషయం తెలిసిందే.
also read:హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ (వీడియో)
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2014లో బీఎస్పీ నుండి కోనప్ప విజయం సాధించారు. ఆ తర్వాత బీఎస్పీని బీఆర్ఎస్ లో విలీనమైన విషయం తెలిసిందే.
also read:ఇక నుండి సెప్టెంబర్ 17న హైద్రాబాద్ విమోచన దినోత్సవం: కేంద్రం నోటిఫికేషన్
కోనేరు కోనప్ప గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి ఆయన బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.