అమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి..

Published : Mar 13, 2024, 01:05 PM ISTUpdated : Mar 13, 2024, 01:08 PM IST
అమెరికాలో జెట్ స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి..

సారాంశం

అమెరికాలో జరిగిన ఓ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల స్టూడెంట్ మరణించారు. కాజేపేటకు చెందిన వెంకట రమణ అక్కడ మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు వెళ్లారు. అయితే జెట్ స్కీ ప్రమాదంలో కన్నుమూశారు.

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కై ప్రమాదంలో తెలంగాణకు చెందిన విద్యార్థి దుర్మరణం చెందాడు. ఆయనను కాజీపేటకు చెందిన 27 ఏళ్ల వెంకటరమణగా గుర్తించారు. ఆయన ఇండియానా యూనివర్శిటీ పర్డ్యూ యూనివర్సిటీ ఇండియానాపోలిస్ (ఐయూపీయూఐ)లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు.

భారతీయులకే బీజేపీ ఉద్యోగాలివ్వలేకపోతోంది.. పాకిస్థానీలకు ఎలా ఇస్తుంది -కేజ్రీవాల్

మార్చి 9న మధ్యాహ్నం 12:30 గంటలకు విస్టేరియా ద్వీపం సమీపంలోని ఫ్యూరీ ప్లేగ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. అయితే మరో జెట్ స్కీని నడుపుతున్న 14 ఏళ్ల బాలుడికి అదృష్టవశాత్తూ అతడికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. 

కాగా.. గతేడాది అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 2023 ఏప్రిల్ లో అమెరికాలోని కెంటకీలోని జాన్స్బర్గ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారిని మహ్మద్ ఫైజల్, ఇషాముద్దీన్ గా గుర్తించారు.

మీకు అవమానం జరిగితే మాతో వచ్చేయండి - నితిన్ గడ్కరీకి ఉద్ధవ్ ఠాక్రే ఆఫర్

అదే ఏడాది అక్టోబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రతిభ కున్వర్ అనే మరో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆమె అక్కడ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనాలిసిస్ చదువుతోంది. అమెరికాలోని కాన్సాస్ లోని చెనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్
Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu