కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

By pratap reddyFirst Published 10, Sep 2018, 2:49 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వం స్పందన కోసం కొంత సమయం వేచి చూడడానికి అసమ్మతి నేత కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తిన ఆమె సోమవారం హనుమకొండలోని రామ్ నగర్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వం స్పందన కోసం కొంత సమయం వేచి చూడడానికి అసమ్మతి నేత కొండా సురేఖ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తిన ఆమె సోమవారం హనుమకొండలోని రామ్ నగర్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

టీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని కార్యకర్తలు ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూద్దామని ఆమె వారికి చెప్పినట్లు సమాచారం. తొలి విడత టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై మనస్తాపానికి గురైన ఆమె ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా స్పందించారు. 

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావుపై ఆమె ధ్వజమెత్తారు. కేటీఆర్ వల్లనే తన టికెట్ ను నిలిపేశారని ఆమె ఆరోపించారు. కేటీఆర్ తెలంగాణను ఆగమం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా అన్నారు. 

ఈ స్థితిలో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ముమ్మరమైంది. అయితే, తాను పార్టీ మారే విషయంపై ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. 

ఈ వార్తాకథనాలు చదవండి

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

కొండా దంపతులపై ఎర్రబెల్లి, గుండు సుధారాణి కౌంటర్ ఎటాక్

ఉత్తమ్ ముందే చెప్పారు: కొండా దంపతులపై వినయ్ ఫైర్

Last Updated 19, Sep 2018, 9:20 AM IST