మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

Published : Oct 31, 2022, 09:51 AM IST
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

సారాంశం

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వాసులుగా గుర్తించారు. బాధితులు శ్రీశైలంలో దైవ దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తులో లారీ ఢీకొట్టినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలో కంటైనర్ ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని గుడిహత్నూర్ మండలం వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అదిలాబాద్ వెళ్తున్న కారు ఓ కంటైనర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఒక మహిళ మృతి చెందారు మరొక మహిళ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. మృతులను అదిలాబాద్ వాసులుగా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !