తెలంగాణలో ఆరో రోజు రాహుల్ గాంధీ భారత్ జడో యాత్ర.. మధ్యాహ్నం కొత్తూరులో ప్రెస్ మీట్..

Published : Oct 31, 2022, 10:18 AM ISTUpdated : Oct 31, 2022, 10:28 AM IST
తెలంగాణలో ఆరో రోజు రాహుల్ గాంధీ భారత్ జడో యాత్ర.. మధ్యాహ్నం కొత్తూరులో ప్రెస్ మీట్..

సారాంశం

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరో రోజు కొనసాగుతుంది. సోమవారం ఉదయం షాద్ నగర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు.

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరో రోజు కొనసాగుతుంది. సోమవారం ఉదయం షాద్ నగర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు పాదయాత్ర ప్రారంభించడానికి ముందు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరా గాంధీ వర్దంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. గుజరాత్‌లోని మోర్బి సస్పెన్షన్ బ్రిడ్జి దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం 2 నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం రాహుల్ యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, పాదయాత్ర మార్గంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్నవారికి అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు కదులుతున్నారు. అలాగే వివిధ వర్గాల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు రాహుల్ పాదయాత్ర లింగారెడ్డి గూడ, చాంద్రాయణ గూడ, కొత్తూరు వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. కొత్తూరులో లంచ్ బ్రేక్ ఉండనుంది. ఇక, ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్తూరు వద్ద రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడనున్నారు. తిరిగా సాయంత్రం పారంభం కానున్న పాదయాత్ర ముచ్చింతల వరకు కొనసాగనుంది. రాహుల్ ఇవాళ దాదాపు 28 కిలోమీటర్ల మేర నడవనున్నారు. రాత్రికి శంషాబాద్ తొండుపల్లి వద్ద రాహుల్ బస చేయనున్నారు. 

 

ఈ రోజు పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో తన వద్దకు ఓ వృద్ద మహిళ రాగా.. ఆమెను రాహుల్ అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆమె కూడా రాహుల్ పట్ల ఎంతో అప్యాయత కనబరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇక, నవంబర్ 7వ తేదీ వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.