మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

By narsimha lode  |  First Published Sep 25, 2018, 6:03 PM IST

మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీడీపీ, సీపీఐ‌లకు కేటాయించే స్థానాల విషయమై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. 



హైదరబాద్: మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీడీపీ, సీపీఐ‌లకు కేటాయించే స్థానాల విషయమై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించడంపై మహాకూటమిలోని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు  మహాకూటమిగా ఏర్పాటై పోటీ చేయాలని  టీడీపీ, కాంగ్రెస్ , సీపీఐ, టీజేఎస్ లు నిర్ణయం తీసుకొన్నాయి. అయితే ఈ పార్టీల మధ్య పొత్తుల చర్చలు ఇంకా  పూర్తి కాలేదు.

Latest Videos

సీట్ల సర్దుబాటు విషయమై ఇంకా కొలిక్కిరాలేదు.  గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో  కాంగ్రెస్, టీడీపీ నేతల  మధ్య సర్ధుబాటు ఇంకా పూర్తి కాలేదు. గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ సీట్లను టీడీపీ కోరుతోంది.  అయితే కొన్ని స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు  ప్రచారాన్ని ప్రారంభించడం టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది.

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని  ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో  కాంగ్రెస్, టీడీపీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఖైరతాబాద్ నుండి సినీ నిర్మాత రోహిన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి నుండి బిక్షపతియాదవ్, కుత్బుల్లాపూర్ నుండి శ్రీశైలంగౌడ్, ఎల్బీనగర్ నుండి సుధీర్ రెడ్డి, జూబ్లీహిల్స్ నుండి విష్ణువర్థన్ రెడ్డి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ స్థానాలను కూడ  టీడీపీ కోరుతోంది.

సత్తుపల్లి, దేవరకద్ర,ఉప్పల్, మక్తల్, కూకట్ పల్లి , సికింద్రాబాద్, కంటోన్మెంట్  సీట్లపై  ఏకాభిప్రాయం కుదిరింది.గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో కాకుండా వరంగల్ జిల్లాలోని నర్సంపేట సీటు కోసం టీడీపీ పట్టుబడుతోంది.

ఇక సీపీఐ కూడ  కొన్ని సీట్ల విషయంలో  కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరితో అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు సీట్లు కావాలని సీపీఐ గట్టిగా డిమాండ్ చేస్తోంది. 

అయితే కొత్తగూడెం నుండి వనమా వెంకటేశ్వరరావు,  హుస్నాబాద్ నుండి ప్రవీణ్ రెడ్డి, మునుగోడు నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేయడం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.బెల్లంపల్లి, వైరా స్థానాలను  సీపీఐకు  కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?
 

click me!