కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్: జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బాధ్యతల అప్పగింత

By narsimha lodeFirst Published Aug 2, 2022, 11:33 AM IST
Highlights

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా చూసే బాధ్యతను సీనియర్ నేత జానారెడ్డికి అప్పగించింది పార్టీ నాయకత్వం. నిన్న కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీల నేతలు సమావేశమయ్యారు. రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించారు.

హైదరాబాద్: Munugode MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా చూసే బాధ్యతను  సీనియర్ నేత Jana Reddy, భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy కి కాంగ్రెస్ నాయకత్వం అప్పగించింది. ఎఐసీసీ. AICC ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత Jana Reddy  సోమవారం నాడు మధ్యాహ్నం హైద్రాబాద్ నుండి New Delhi కి చేరుకున్నారు. సోమవారం నాడు సాయంత్రం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ కేసీ వేణుగోపాల్ తో జానారెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సమావేశమయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహరంపై చర్చించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ నాయకత్వం బాధ్యతలను అప్పగించింది. ఈ విషయమై జానారెడ్డి , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కోమటిరె్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించే అవకాశాలున్నాయి. గంలో ఇదే విషయమై మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలు ఇచ్చారు. కోమటిరెడ్డది రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ పోన్ కూడా చేశారు. ఢిల్లీ రావాలని సూచించారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లలేదు.

రెండు రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారన్ని తేల్చాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచన మేరకు రెండు రోజుల్లో ఈ వ్యవహరంపై తేల్చే అవకాశం ఉంది.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీడితే ఆ తర్వాతి పరిణామాలపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్చించనుంది. మునుగోడు  అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే  అభ్యర్ధి ఎంపికతో పాటు ఉప ఎన్నికల బాధ్యతను కూడా ఈ ఇద్దరికే అప్పగించింది పార్టీ నాయకత్వం..కాంగ్రెస్ పార్టీని వీడాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు.కేసీఆర్ పాలనను అంతం చేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమని కూడా ఆయన గత మాసంలో ప్రకటించారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారకుండా చర్చలు ప్రారంభించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ చర్చించారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా చర్చించారు.

also read:ఢీల్లీకి జానారెడ్డి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై చర్చ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలో చేరుతారని బీజేపీనేతలు కూడా బహిరంగంగానే చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత మాసంలో ఈ విషయాన్ని ప్రకటించారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఇతరులు పార్టీలో చేరే విషయమై  అగ్రనేతలతో చర్చించారు. 

click me!