నిన్న 11 గంటల విచారణ: నేడు కూడా చీకోటి ప్రవీణ్ ను విచారించనున్న ఈడీ

By narsimha lodeFirst Published Aug 2, 2022, 10:09 AM IST
Highlights

చీకోటి ప్రవీణ్ సహా మరో నలుగురిని ఇవాళ కూడా ఈడీ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది. సోమవారం నాడు 11 గంటల పాటు ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారించారు. నిన్న విచారణలో కొన్ని కీలక విషయాలను ఈడీ అధికారులు గుర్తించారు.


హైదరాబాద్: Casino వ్యాపారం నిర్వహించిన Chikoti Praeen సహా మరో నలుగురు  మంగళవారం నాడు కూడా ఈడీ విచారణకు రానున్నారు. నిన్న ప్రవీణ్ సహా మరో నలుగురు కూడా Enforcement Directorate  విచారణకు హాజరయ్యారు. సోమవారం నాడు 11 గంటల పాటు ప్రవీణ్, Madhava Reddy సహా మరో ముగ్గురిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రవీణ్  సహా మరో నలుగురిని కూడా ఇవాళ ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. 

ఏడు మాసాల్లో ఏడు దేశాల్లో చీకోటి ప్రవీణ్ Hyderabad నుండి పలువురిని తీసుకెళ్లి కేసినో ఆడించారని ఈడీ అధికారులు గుర్తించారు.  చీకోటి ప్రవీణ్ లాప్ టాప్ తో పాటు మొబైల్ లో ఉన్న డేటాను కూడా ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు.ఈ డేటా ఆధారంగా కూడా ఈడీ అధికారులు ప్రవీణ్ ను ప్రశ్నించారని సమాచారం. బిగ్ డాడీ అడ్డా  ప్రమోషన్ కోసం ప్రవీణ్ సినీతారలను కూడా ఉపయోగించుకున్నారు. 

హవాలా మార్గంలో ప్రవీణ్ డబ్బులు తరలించారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారని ప్రముఖ తెలగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ప్రవీణ్ కు రాజకీయ, సినీ ప్రముఖులతో సంబంధాలున్న విషయాన్ని కూడా ఈడీ అధికారులు గుర్తించారని ఈ కథనం తెలిపింది. 

చీకోటి ప్రవీణ్ కేసినో ఆడే వారికి టోకెన్లు జారీ చేసేవారని ఈడీ అధికారులు గుర్తించారు. విదేశాలకు కేసీనో ఆడేందుకు వెళ్లేవారికి టోకెన్లు జారీ చేసేవారు ప్రవీణ్. కేసినోలో డబ్బులు గెల్చుకున్న వారికి కూడా ప్రవీణ్ టోకెన్లు ఇచ్చేవారు.ఈ టోకెన్ల ఆధారంగానే డబ్బులు తీసుకోవడం, చెల్లింపులు జరిగినట్టుగా అధికారులు గుర్తించారని ఈ కథనం తెలిపింది. విదేశాల్లో టోకెన్లు తీసుకొని హైద్రాబాద్ వచ్చాక ప్రైజ్ మనీని తీసుకొనేవారని ఈడీ అదికారులు గుర్తించారు. చీకోటి ప్రవీణ్ లాప్ టాప్ లో నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ప్రవీణ్ నాలుగు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్ మెంట్ల ఆధారంగా కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

సోమవారం నాడు రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ప్రవీణ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇవాళ కూడా విచారణ చేసే అవకాశం ఉంది. ప్రవీణ్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ డాడీ అడ్డా ప్రమోషన్ కోసం చీకోటి ప్రవీణ్ సినీ తారలతో ప్రచారం చేయించాడు.ఈ ప్రమోషన్ కు సంబంధించిన వీడియోలను వాట్సాప్ ద్వారా ప్రముఖులకు షేర్ చేసిన విషయాన్ని కూడా ఈడీ అధికారులు గుర్తించారు.

 వెయ్యి మందికిపైగా హైద్రాబాద్ నుండి విదేశాలకు తీసుకెళ్లి కేసినో ఆడించారని అధికారులు గుర్తించారు.  విదేశాలకు వీరిని తీసుకెళ్లేందుకు అవసరమైన విమాన టికెట్లు , ప్రత్యేకంగా విమానాలను బుక్ చేయంలో సంపత్ కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు.ఈ విషయమై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  ప్రవీణ్  పుట్టిన రోజున సంపత్ రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయమై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవల కేసినో నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి.ఈ ఆరోపణలను ప్రవీణ్ తీవ్రంగా ఖండించారు. కేసినో నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు.జూదం ఆడించినట్టుగా మీడియా చానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.గుడివాడలో కేసినో నిర్వహించారని టీడీపీ నేతలు విమర్శలు చేశారు.ఈ విమర్శలను మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

also read:కేసీనో దందా: ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్

మరోవైపుహైద్రాబాద్ నగర శివార్లలోని ఓ హీరో ఫామ్ హౌస్ లో నిర్వహించిన కేసీనో వ్యవహరంలో కూడా ప్రవీణ్ కు ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చినట్టుగా ఈ కథనం తెలిపింది. 

click me!