ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకుపై దుండగుల దాడి: పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు

Published : Aug 02, 2022, 10:42 AM ISTUpdated : Aug 02, 2022, 11:10 AM IST
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకుపై దుండగుల దాడి: పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు

సారాంశం

ఖమ్మం ఎంపీ నామా  నాగేశ్వరరావు కొడుకు  పృథ్వీతేజపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.ఈ ఘటనకు సంబంధించి బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

హైదరాబాద్: Khammam ఎంపీ Nama Nageswara rao తనయుడు Nama Prithvi Tejaపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.ఈ ఘటనకు సంబంధించి పృథ్వీతేజ హైద్రాబాద్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పృథ్వీ తేజ కారును ఆపి కారులో ఎక్కిన దుండగులు కత్తితో బెదిరించి పృథ్వీతేజ నుండి రూ, 75 వేలు దోచుకున్నారని పోలీసులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పృథ్వీతేజ కారును అడ్డగించి దోచుకొన్నవారెవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

పృథ్వీతేజ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుజేజీని పరిశీలిస్తున్నారు. పృథ్వీతేజ  ఏ మార్గంలో ప్రయాణం చేశాడో  ఆ మార్గంలోని సీసీటీవీల పుటేజీని పరిశీలించనున్నారు. ఈ మార్గంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా లేక పృథ్వీని ఎవరైనా వాహనంలో అనుసరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. 

ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు షాపింగ్ కు వచ్చి షాపింగ్ చేసి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో దుండగులు అతడి కారులో ఎక్కారు. కారులో ఎక్కిన తర్వాత పృథ్వీతేజకు కత్తి చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు.  పృథ్వీతేజ నుండి రూ. 75 వేలు దోచుకున్నారు.ఈ ఘటన జూలై 31న చోటుచేసుకొంది. అయితే ఈ విషయమై ఆగష్టు 1వ తేదీ రాత్రి నామా పృథ్వీతేజ వ్యక్తిగత సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు పిర్యాదు చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం