
కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. నల్లగొండ సమీపంలోని కొత్తగూడెం వద్ద ఆయన కారు వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో కారులో ఉన్నవాళ్లంతా క్షేమంగా బయటపడగలిగారు.