కబర్దార్ కెసిఆర్ నిన్ను గజ్వేల్ లోనే ఓడిస్తా

Published : Jul 04, 2017, 08:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
కబర్దార్ కెసిఆర్ నిన్ను గజ్వేల్ లోనే ఓడిస్తా

సారాంశం

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎం కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెసిఆర్ ను గజ్వెల్ లో ఓడించే సత్తా నాకుంది. మరి నన్ను నల్లగొండలో ఓడించే సత్తా నీకుంటే వచ్చి పోటీ చేయి అని సవాల్ విసిరారు. కెసిఆర్ గారు నువ్వు 500 కోట్ల రూపాయలతో కట్టుకున్న అద్దాల మేడనుండి కాకుండా పెదకాపర్తికి వచ్చి చూడు తెలుస్తోంది నీ సర్వేలు ఎక్కడ పోతున్నాయో అని విమర్శించారు.

 

అడవులనుండి వచ్చిన ఎమ్మెల్యే (నకిరేకల్ mla) మళ్లీ అడవులకే పోయే రోజులు దగ్గరకు వచ్చాయి. నకిరేకల్ ఎమ్మెల్యే అన్న తుపాకులు అమ్ముకుంటూ జైలుకు వెళ్ళి కూర్చుండు.

 

ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో, నాలాంటి వారు మంత్రి పదవులు వదిలి, సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణా తెస్తే  తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రకాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టి కొడుకు ,బిడ్డ ,అల్లుడు రాజ్యమేలుతున్నారు.

 

మా ప్రభుత్వం వఛ్చిన తరువాత నిన్ను వెంటాడి నీ అక్రమ సంపాదనను రికవరీ చేస్తాం. రైతుల ఋణమాపి ఒక్కసారి ఇవ్వకుండా 4 విడతలుగా ఇచ్చావు ,అది వడ్డీకే సరిపోలేదు రైతుల ఉసురు తప్పనిసరిగా తగులుతుంది.

 

నకిరేకల్, సూర్యాపేటలలో నీ ఎమ్మెల్యేలకు డిపాజిట్ కూడా రావు.

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?