కార్పొరేటర్ హేమ శ్యామల తండ్రి కరాటే రాజు కబ్జా లీలలు

Published : Jul 04, 2017, 02:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
కార్పొరేటర్ హేమ శ్యామల తండ్రి కరాటే రాజు కబ్జా లీలలు

సారాంశం

సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల తండ్రి కరాటే రాజు జనాలను భయపెడుతున్నాడు. భూకబ్జాలు చేస్తున్నాడు. అడ్డొచ్చిన వారిని చితకబాదుతున్నాడు. కనుగుడ్లు ఊడిపోయేలా, రక్తం చిందేలా చావబాదుతున్నాడు. ఆయన అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమంటున్నాయి. వారి బాధితులు ఫేస్ బుక్ లో చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి.


 

ఒక ఇంటిని కబ్జా చేసేందుకు వెళ్లిన కరాటే రాజు ఆ ఇంటి యజమానిని అతని భార్యని ఖాళీ చేయమని వేధింపులకు గురిచేశాడు.  నిన్న రాత్రి ఇంట్లో దూరి తన మనుషులతో కొట్టిస్తే రెండు కండ్లు పోయి రక్తపుటేరులో మునిగిపోయాడు ఆ మనిషి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికితస పొందుతున్నాడు. ఆ బాధితుడి పేరు గొడిశాల వీరాస్వామి గౌడ్. అతని భార్యపై కూడా ఇంతకుముందు దాడి చేశారు.

 

గొడిశాల వీరాస్వామి గౌడ్, మధు మాలతి దంపతులకు నలుగురు కూతుర్లు. వారిని ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారు సదరు కరాటే రాజు అంతకుముందు తెలుగుదేశం లో శ్రీనివాస్ యాదవ్ తో తిరిగి రౌడీ షీటర్ లాగా చెలామణి అయ్యాడు. తెలంగాణ రాగానే మళ్ళీ తెరాస లో చేరి తన బిడ్డకు టికెట్ ఇప్పిచ్చి , గెలిపించి భూకబ్జాలకు పాల్పడుతున్నడని బాధితులు ఆరోపించారు.

 

కరాటే రాజు ముందుగా టార్గెట్ చేసిన వారిపై దౌర్జన్యం చేసి తర్వాత దెబ్బలు తిన్న వాళ్ల మీద మళ్లీ వీళ్ళే కేసు ఫైల్ చేస్తరు అని బాధితులు చెబుతున్నారు. ప్రజలు కేసు ఫైల్ చేస్తే , 'మీకుంది అమ్మాయిలు , వాళ్ళ మీద తప్పుడు కేసు పెడతం' అని బెదిరించి ఇంతకుముందున్న పోలిసుల తోని కల్సి కేసులు కొట్టేపించిన్రు అని బాధితులు అంటున్నారు. ఆ ఆడపిల్లలని కరాటే రాజు తమ్ముడు (తెలుగు దేశం) వేధించడం. వీర స్వామి కి పోయిన రెండు కన్నులు ఒకటి హేమ శ్యామల , ఒకటి కరాటే రాజు దానం ఇస్తరా?? అని నిలదీస్తున్నారు.

 

తెలంగాణ తెచ్చుకోవడం ఎంత అవసరమయిందో , ఇలాంటి రౌడీ గాండ్లను తెలంగాణాలో లేకుండా చేయడం అంతే అవసరం. హేమ శ్యామల నామినేషన్ మీద కూడా ఆమె కబ్జా చేసిన ఇంటి అడ్రస్సే ఉంది అని బాధితులు ఆరోపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం