
గ్రూప్ 2 అభ్యర్థుల ఫలితాలు వెలువడిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 1 : 3 చొప్పున అభ్యర్థులను టిఎస్పిఎస్సీ పిలిచింది. ఇది మొదలుకాకముందే జవాబు పత్రాలపై వైటనర్ వినియోగించిన వారిని కూడా ఎందుకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అనుమతించారని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మూడు వారాల పాటు స్టే ఇచ్చింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగిపోయింది. తర్వాత కోర్టులో సర్కారు మరో మూడు వారాల పాటు స్టే కోరింది. అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని కోరడంతో కోర్టు అనుమతించింది.
తాజాగా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 2లో 14 ప్రశ్నలు పూర్తిగా తప్పు ఉన్నాయని,17 ప్రశ్నలు తొలగించడం పై, 14 ప్రశ్నలు రెండుసార్లు రావడం పై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతోపాటు తిరిగి గ్రూప్ 2 పరీక్ష ను మళ్ళీ జరిపించాలని పిటిషనర్లు అభ్యర్థించారు.
దీనిపై విచారించిన హైకోర్టు నాలుగు వారాల వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టకుండా దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, టిఎస్పీఎస్సీ కి నోటీసలు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.