తెలంగాణ డిఎస్సీ అభ్యర్థులను 72 సార్లు మోసం చేసిన కేసిఆర్

Published : Sep 03, 2017, 06:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
తెలంగాణ డిఎస్సీ అభ్యర్థులను 72 సార్లు మోసం చేసిన కేసిఆర్

సారాంశం

డిఎస్సీ త్వరలో త్వరలో అంటూ మోసం చేస్తున్నారు దళిత సిఎం అని అప్పుడు మోసం చేశారు దళితులకు మూడెకరాలు అంటూ ఇప్పుడు మోసం

డిఎస్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులను తెలంగాణ సిఎం కే కేసిఆర్ 72సార్లు మోసం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పర్యటించారు. గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఆయన వెంట ఉన్నారు. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ మూడేళ్లలో 72సార్లు డిఎస్సీ వేస్తామంటూ ప్రకటనలు చేసిందన్నారు. కానీ ఇంకా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్న సంతోషం కూడా లేకుండాపోయిందన్నారు. 

దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన కేసిఆర్ తుదకు దళితులకు మూడెకరాలు ఇస్తానంటూ మళ్లీ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. నాలుగు కోట్ల ప్రజాపాలనను నలుగురికే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. 

ఎమ్మెల్యే వీరేశం పై సెటైర్

స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంపై పరోక్షంగా సెటైర్ లు వేశారు కోమటిరెడ్డి. వాళ్లలాగా మాకు ఆయుధాలు అమ్మడం, సెటిల్మెంట్లు చేయడం రాదని చెప్పారు. మేము ప్రజలతో ప్రేమగా ఉంటాము తప్ప వారిలా బెదిరింపులకు పాల్పడము అని పేర్కొన్నారు. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu