పాండవుల గుట్టపై అదరగొట్టిన ఆమ్రపాలి

Published : Sep 03, 2017, 05:41 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
పాండవుల గుట్టపై అదరగొట్టిన ఆమ్రపాలి

సారాంశం

ఆమ్రపాలి సంచనం సృష్టించారు. జయశంకర్ జిల్లాలో దుమ్మురేపారు సరికొత్త రికార్డులు లిఖిస్తున్నారు

వరంగల్ అర్బన్ కలెక్టర్ మళ్లీ అదరగొట్టేశారు. ఆమె సరికొత్త సాహసానికి ఒడిగట్టారు. ఆమె ఏది చేసినా తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే.

గతంలో తోటి కలెక్టరమ్మతో కలిసి ఫారెస్టులో నడిచి హల్ చల్ చేశారు. తర్వాత హైదరాబాద్ లో టెన్ కె రన్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 

తాజాగా జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలంలోని పాండవుల గుట్టలలో నిర్వహిస్తున్న రాక్ క్లయింబింగ్ ఫెస్టివల్ లో పాల్గొని ఔరా అనిపించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి పాండవుల గుట్టలు అదిరోహించి దుమ్మురేపారు.

ఆమెతోపాటు వరంగల్ అర్బన్ డిఎఫ్ఓ అర్పనణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా డిఎఫ్ఓ రవికిరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలాంటి సాహసాలు ఐఎఎస్ అధికారిణి ఆమ్రపాలికి కొత్త కాదని జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. కీపిటప్ కలెక్టరమ్మ.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే