హైదరాబాద్ లో 300 మంది ఎఇ ల నియామకం : కేటిఆర్

Published : Sep 02, 2017, 07:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
హైదరాబాద్ లో 300 మంది ఎఇ ల నియామకం : కేటిఆర్

సారాంశం

ప్రాజెక్టుల కాలపరిమితి మేరకు 300 మంది ఏఈ ల నియామకం న్యాక్ అధ్వర్యంలో సివిల్ ఇంజనీర్లకు శిక్షణ ప్రస్తుతం ఉన్న సూమారు 480 ఇంజనీరింగ్ సిబ్బందికి వీరి సహకారం రోడ్లు, స్కైవేలు, మూసి అభివృద్ది, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం వీరి సేవలు ఈ నియామకాలతో పనుల వేగం, పారదర్శకత, సమన్వయం, క్వాలీటీ పెరుగుతాయి

హైదరాబాద్ లో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రాజెక్టుల కాలపరిమితి మేరకు 300 మంది ఏఈలను నియామకం చేయనున్నట్లు మున్సిపల్ మంత్రి కేటిఆర్ వెల్లడించారు. వారు వచ్చిన తర్వాత సిటీ ప్రాజెక్టులు వేగవంతం కావడంతోపాటు హైదరాబాద్ రూపు రేఖలే మారిపోతాయన్నారు. జియచ్ యంసి పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ సిబ్బందికి అదనంగా మరో 300 మంది ఇంజనీర్ల సేవలను వినియోగించకోనున్నట్లు మంత్రి కెటి రామారావు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగర స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం స్వల్ఫకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నదని,  వీటిలో భాగంగా పలు మౌళిక వసతులు కల్పన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ముఖ్యంగా నగర పరిధిలో రోడ్లు, స్కైవేలు, మూసి అభివృద్ది, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం సూమారు 20 వేల కోట్లు రూపాయాలను ఖర్చు చేసున్నామన్నారు. ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ప్రాజెక్టులు పర్యవేక్షణ, అనుకున్న గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పెద్ధ ఏత్తున ఇంజనీరింగ్ సిబ్బంది అవసరం అన్నారు. దీంతోపాటు తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఒకటిన్నర, రెండు సంవత్సరాల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని, వీటి పర్యవేక్షణ, అమలు కోసం అదనంగా 300 మంది సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లను నేషనల్ అకాడమీ అప్ కన్స్ట్రక్షన్(న్యాక్ ) ద్వారా శిక్షణ ఇప్పించి, వారి సేవలను వినియోగించుకుంటామన్నారు.

 హైదరాబాద్ రొడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్, మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, డబుల బెడ్ రూం ప్రాజెక్టుల కాలపరిమితుల వారీగా వీరిని నియమించుకుంటామన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా సూమారు 2లక్షల 80 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తుంటే, హైదరాబాద్ నగరంలోనే లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామని, ఇవన్నింటికి టెండర్లు పూర్తయ్యన్నారు. సూమారు 110 సైట్లలో పనులు జరుగుతాయని, ఇలాంటి చోట్ల ఇంజనీరింగ్ సిబ్బంది అవసరమని, దీంతోపాటు నగరంలోని 150 డివిజన్కు ఒక్కోక్క ఏఈని ప్రత్యేకంగా రోడ్ల నిర్వహణ భాద్యతలు అప్పజేప్పనున్న నేపథ్యంలో మరో 150 ఇంజనీర్లు అసవరం అవుతారన్నారు. దీంతోపాటు మూసి, రోడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ కోసం  మరికొంత మంది అవసరం అయిన నేపథ్యంలో కొత్తగా ఈ 300 మంది ఇంజనీర్లను జియచ్ యంసి నియమించుకుంటుదన్నారు.

ఈ మెత్తం నియామకాలు సెప్టెంబర్ నాటికి పూర్తి చేసుకోవాలని కమీషనర్ కు మంత్రి అదేశాలు జారీ చేశారు. నగరంలో సంవత్సరం లోపల ప్రజలకు మార్పు చూపించాలన్న లక్ష్యంతో ఈ నియామకాలు చేస్తున్నామన్నారు. ఈ నియామకాలతో పనులు వేగంగా జరగడంతోపాటు, పనుల్లో మరింత పారదర్శకత, సమన్వయం, క్వాలీటీ పెరుగుతుందని మంత్రి కెటి రామారావు తెలిపారు. పనుల నాణ్యతలో రాజీ లేకుండా చూసేందుకే ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి అదేశాల నేపథ్యంలో జియచ్ యంసి అధికారులు, న్యాక్ అధికారులు, ప్రాజెక్టుల అధికారులు, నియామాకాల మార్గదర్శకాలు తయారు చేస్తున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

PREV
click me!

Recommended Stories

DCP Shilpavalli Statement on Koti Shooting Incident | 6Lakhs Robbery at SBIATM | Asianet News Telugu
IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!