
ఖమ్మం జిల్లాలో ప్రబలిన విషజ్వరాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ఇవాళ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించారు. జిల్లాలోని బోనకల్ మండలం రావినూతలలో విషజ్వరాల బారినపడి న గిరిజనులకు సరైన చికిత్స అందడం లేదని దీనిపై వెంటనే చర్యలు తీసుకోని బాధిత కుటుంబాలను ఆదుకోనేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన ఫిర్యాదులో కోరారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్ సి 15 రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఆదేశించింది.