నేనెవరికి ఏజంటును కాదు : కోదండరామ్

First Published Oct 25, 2016, 10:48 AM IST
Highlights
  •   రైతుల మీద సానుభూతితోనే రైతుల పక్షాన నిలబడుతున్నా
  • దుమ్మెత్తిపోడం కన్నా రైతులకు సాయం చేయడం గురించి యోచించాలి

రైతుల  కోసం ఉద్యమించడంలో తననెవరూ నడిపించడం లేదని,తానెవరి అజండా ప్రకారం పనిచేయడం లదని  తెలంగాణా  పొలిటికల్ జెఎసి  ఛెయిర్మన్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఇటీవల రైతుల సమస్యల మీద తన పోరాటాన్ని క్రమంగా ఉదృతం చేస్తుండడాన్ని రాష్ట్రం మంత్రులు, తెలంగాణా రాష్ట్రసమితి నాయకులు కోదండరామ్ మీద కారాలు మిరియాలు నూరడమే కాదు, ఆయన ఎవరో  ప్రభుత్వం మీద వుసి కొల్పుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కోదండరామ్ కాంగ్రెస్ అజండాను అమలుచేస్తూ దీక్షకు దిగారని కూడా  వారు విమర్ఇంచారు.  మంగళవారం నాడు ఆయన సదాశివపేట, నాల్కల్ మెదక్ లలోపర్యంచారు.

ఈ  సందర్భంగా తెరాస నాయకులు చేసిన విమర్శలను ఆయన తోపిపుచ్చారు.వర్షాలు  ఎక్కువగాకురిసొకచోట, కురియక మరొక చోట రైతులు నష్టపోయారని, వారందరిని ఆదుకోవాలని  తాను కోరడం వెనక ఎవరి ప్రోద్బలం లేదని ఆయన చెప్పారు.

కష్టాలలో ఉన్న వారి పట్ల సానుభూతి స్పందిస్తున్నాను తప్ప ఇందులో రాజకీయాలకు ఎలాంటి తావు లేదని చెబుతూ పంట పోయిన రైతులకు పరిహారం ఇవండనడం సరైన డిమాండ్ అని  ఆయన చెప్పారు.

సమస్యలు ఎత్తి చూపిన వారి మీదల్లా దుమ్మెత్తి పోసే సంస్కతి మంచిది  కాదని ఆయన చెప్పారు.  ఎదురుదాడులకు పూనుకోకుండా రైతులకు మేలు చేసే విషయం గురించి ప్రభుత్వం యోచిస్తే  బాగుంటుంది అని అన్నారు.

 ఈ మధ్య కాలంలో  ప్రొఫెసర్ కోదండ్ రామ్ రైతుల సమస్యల నిర్విరామంగా తిరుగుతున్నారు.  అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నారు. రెండు రోజలు కిందట హైదరాబాద్ లోరాష్ట్ర రైతుల దీక్షకు నాయకత్వం వహించిన కోదండరామ్ ఇపుడు మళ్లీ పర్యటనకు పూనుకున్నారు. ఈ రోజు మెదక్ సంగారెడ్డి జిల్లాలలో పర్యటించారు.

 

 

 

click me!