కోదాడలో కేటీఆర్ వ్యూహం... శాంతించిన శశిధర్ రెడ్డి, నామినేషన్ వెనక్కి

By sivanagaprasad kodatiFirst Published Nov 22, 2018, 11:47 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కోదాడ నుంచి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శశిధర్ రెడ్డి మనసు మార్చుకున్నారు. రెబల్ అభ్యర్థిగా తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కోదాడ నుంచి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శశిధర్ రెడ్డి మనసు మార్చుకున్నారు. రెబల్ అభ్యర్థిగా తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. తొలుత శశిధర్ రెడ్డికి కోదాడ టికెట్ దక్కుతుందని ప్రచారం జరిగింది.

అయితే చివరి నిమిషంలో టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్‌లో చేరడంతో.. రాజకీయ సమీకరణాల రీత్యా ఆయనకే టికెట్ కన్ఫార్మ్ చేశారు కేసీఆర్. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన శశిధర్ రెడ్డి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

ఆయనను బుజ్జగించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్టీలో ఉన్నత పదవితో పాటు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే స్థాయికి తగ్గకుండా ప్రభుత్వంలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో శశిధర్ అలక వీడారు.

ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్‌లో అనుచరులతో కలిసి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ రోజు తన నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటానని శశిధర్ రెడ్డి ప్రకటించడంతో టీఆర్ఎస్‌లో కోదాడ వివాదం ముగిసినట్లయ్యింది. 
 

వీహెచ్‌కు తప్పిన ప్రమాదం... టీఆర్ఎస్ కుట్రేనన్న హనుమంతన్న..?

బ్రిస్బేన్ టీ20లో టీఆర్ఎస్ ప్లకార్డులు...కాదేది ప్రచారానికనర్హం

కేసీఆర్‌కు షాక్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్ఎస్ కు రాజీనామా

విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు: మహేందర్ రెడ్డి

టీఆర్ఎస్ కి మరో షాక్...విశ్వేశ్వర్ రెడ్డి వెంటే మరో నేత

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

కేసీఆర్‌కు షాక్: బెల్లంపల్లి నుండి బరిలోకి వినోద్, తెర వెనుక కథ ఇదీ

click me!